వరి ధాన్యం కొనుగోళ్లపై కొనసాగుతున్న రగడ... క్లారిటీ వచ్చేనా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు మరింత రంజుగా మారుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలతో పెద్ద ఎత్తున రాజకీయం రణరంగంగా మారిన పరిస్థితి ఉంది.

 Ongoing Quarrel On Paddy Grain Purchases . Will Clarity Come Bjp Party, Kcr , Pa-TeluguStop.com

అయితే ఇక మరో సారి యాసంగి వరి ధాన్యం కొనుగోలు అంశం మరోసారి రాజకీయం రణరంగంగా మారిన పరిస్థితి ఉంది.ఇప్పటికే  కేసీఆర్  రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేపట్టే వరకు నిరసనలు కొనసాగిస్తామని కెసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం కేంద్ర మంత్రి యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చినా ప్రభుత్వం నుండి మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

అయితే మంత్రి నిరంజన్ రెడ్డి మాత్రం కేంద్ర మంత్రి అలా పచ్చిగా అబద్దాలు చెప్పడం బాధాకరమని అభిప్రాయ పడ్డారు.

అయినా ఈ రగడ మాత్రం ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది.అయితే రానున్న రోజుల్లో కొనుగోళ్ల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏవైనా కండీషన్ లు పెడితే టీఆర్ఎస్ నుండి తీవ్ర నిరసన వ్యక్తమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

క్రితం దఫాలో కూడా కొనుగోళ్ల అంశంపై ఎవ్వరికీ అంతగా క్లారిటీ రాకున్నా ఈ సారైనా వస్తుందా అని ప్రజల్లో, రైతుల్లో చర్చ మొదలైందని చెప్పవచ్చు.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Central, Nira

ఏది ఏమైనా పండిన పంట అంతా కొనుగోలు చేసే పరిస్థితి లేదనేది సుస్పష్టమైనప్పటికీ రానున్న రోజుల్లో కేంద్రం వ్యవహరించే విధానంతో రాష్ట్రం కొనుగోళ్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అయితే రైతులకు ప్రభుత్వం నుండి విజ్ఞప్తులు వెళ్ళినా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టనటువంటి పరిస్థితి ఉంది.ఏది ఏమైనా నీటి లభ్యత తెలంగాణలో ఎక్కువగా ఉండటం వల్ల వరి సాగుకే ఎక్కువగా ఆసక్తి చూపడం ప్రస్తుతం అతి పెద్ద సమస్యగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube