రంజాన్ ఉపవాసాలపై కొనసాగుతున్న నిషేధం!

ముస్లిం లకు పవిత్రమైన మాసం రంజాన్ మాసం.ఈ రంజాన్ మాసం లో ప్రతి ఒక్క ముస్లిం కూడా ఉపవాస దీక్ష చేపట్టి అత్యంత కఠినంగా ఈ ఉపవాస దీక్షలను చేపడుతూ ఉండడం చూస్తూనే ఉంటాం.

 Ongoing Ban On Ramzan Fasts-TeluguStop.com

ఈ రంజాన్ మాసం చేపట్టే దీక్షను ‘రోజ్’ అని అంటారు.అయితే కఠినంగా చెప్పుకొనే ఈ దీక్షను ప్రతి ఒక్క ముస్లిం చేయడానికి ఇష్టపడతారు.

అయితే ఈ ఉపవాసాలు చేయడాన్ని నిషేదించారు.ఎక్కడ అని అనుకుంటున్నారా.డ్రాగన్ దేశం చైనా లో ఈ ఉపవాస దీక్షలు చేపట్టడం పై నిషేధం విధించారు.2015 లో తొలిసారిగా రంజాన్ ఉపవాస దీక్షలపై చైనా లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిషేధం విధించింది.ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం ఇలాంటి ఉపవాసాలు తీవ్రవాదానికి దారి తీస్తాయన్న ఉద్దేశ్యం తో ఈ ఉపవాసాల పై నిషేధం విధించింది.

అయితే ఈ నిషేధం ఈ ఏడాది కూడా కొనసాగనున్నట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా ఉయ్ ఘర్ లు ఇతర ముస్లిం గ్రూపులు ఎక్కువగా ఉన్న వాయవ్యప్రాంత జిన్జియాంగ్ ప్రావిన్సులో దీనిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది.ఎవరైనా ఉపవాస దీక్ష చేసినట్లు తేలితే కాన్సన్ట్రేషన్ (రీఎడ్యుకేషన్) శిబిరాలకు తరలిస్తున్నారట.

అక్కడ ఉన్న దాదాపు కోటి మంది ఉయ్ ఘర్ ముస్లింలపై పూర్తి నిఘా కొనసాగుతోంది.అయితే మరోపక్క రంజాన్ ఉపవాసదీక్షలపై ఈ విధంగా నిషేధాన్ని విధించడాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ గ్రూప్ లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మత స్వేచ్ఛను అడ్డుకుంటున్నారు అంటూ ఇస్లామిక్ గ్రూప్ లు ఆరోపిస్తున్నాయి.అయితే ఈ వ్యాఖ్యలను చైనా ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు.ఒకవేళ ఎవరైనా ఉపవాస దీక్ష చేస్తే మాత్రం ప్రతీ కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా ఈ కేంద్రాలకు వెళ్లి, వారాల తరబడి ఉండి, చైనా అధికారుల చేత పాఠాలు చెప్పించుకొని వస్తున్న పరిస్థితి ఏర్పడింది అని ఒక అంచనా ప్రకారం వెల్లడైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube