One Plus 6T ఫోన్‌కు ఎందుకంత క్రేజ్ ఉంది..? అంతలా ఫీచర్లు అందులో ఏమున్నాయో తెలుసా..?

ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు దీటుగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు ఎలా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయో అందరికీ తెలిసిందే.ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను ఆయా ఫోన్లలో వన్‌ప్లస్ అందిస్తోంది.

 Oneplus 6t Mobiel Craze In India-TeluguStop.com

దీంతోపాటు కెమెరా, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, బ్యాటరీ, పెర్ఫార్మెన్స్ విషయంలోనూ వన్‌ప్లస్ ఫోన్లు ప్రీమియం ఫోన్ల కన్నా మెరుగ్గా పనిచేస్తున్నాయి.అలాగే ధర కూడా ప్రీమియం ఫోన్ల కన్నా చాలా తక్కువగా ఉంటుండడంతో మొదట్నుంచీ వన్‌ప్లస్ ఫోన్లకు క్రేజ్ ఏర్పడింది.

ఇక త్వరలో వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్ కూడా విడుదల కానుంది.దీంతో ఆ ఫోన్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే అసలు వన్‌ప్లస్ 6టికి జనాల్లో ఎందుకంత క్రేజ్ ఏర్పడింది.? అంటే.ఇదిగో.ఇందుకే.ఈ కింద తెలిపిన ఫీచర్లను ఆ ఫోన్‌లో ఏర్పాటు చేశారు.అందుకనే వన్‌ప్లస్ 6టి ఫోన్ కోసం యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి వారిని తెగ ఆకట్టుకుంటున్న ఆ ఫీచర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.!

1.వాటర్ డ్రాప్ నాచ్


నాచ్ తరహా డిస్‌ప్లే ఫోన్లకు ఇప్పుడు డిమాండ్ బాగా ఉంది.అందుకే అన్ని కంపెనీలు ఈ తరహా డిస్‌ప్లేలను తమ తమ ఫోన్లలో అందిస్తున్నాయి.

ఈ క్రమంలో వన్ ప్లస్ ఇంకాస్త ముందడుగు వేసి వాటర్ డ్రాప్ నాచ్‌ను వన్‌ప్లస్ 6టి లో ఏర్పాటు చేసింది.ఇందులో ఫోన్ ముందు భాగంలో మొత్తం డిస్‌ప్లేనే ఎడ్జ్ టు ఎడ్జ్‌లో ఉంటుంది.

కేవలం ఒక్క సెల్ఫీ కెమెరానే ముందు భాగంలో డిస్‌ప్లేపై వాటర్ డ్రాప్‌లా ఉంటుంది.అందుకే ఈ డిస్‌ప్లేకు వాటర్ డ్రాప్ నాచ్ అని పేరు పెట్టారు.ఈ డిజైన్ వల్ల ఫోన్ డిస్‌ప్లే మరింత అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది.దీన్నే వన్‌ప్లస్ 6టి లో త్వరలో పొందవచ్చు.

2.ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్


మొన్నటి వరకు చాలా ఫోన్లకు ముందు భాగంలో హోమ్ బటన్ కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు.ప్రస్తుతం కొన్ని ఫోన్లకు సైడ్ భాగంలో, కొన్నింటికి వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్లను అమరుస్తున్నారు.అయితే వన్‌ప్లస్ 6టి ఫోన్లో మాత్రం డిస్‌ప్లే కిందే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

డిస్‌ప్లే కింది భాగంలో ఫింగర్‌తో టచ్ చేస్తే చాలు ఫోన్ అన్‌లాక్ అవుతుంది.తెర కిందే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండడం వల్ల ఫోన్ మరింత సురక్షింతగా ఉంటుంది.

వన్‌ప్లస్ 6టిలో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసినందున దీనికి మరింత క్రేజ్ పెరిగింది.

3.బ్యాటరీ


వన్‌ప్లస్ ఫోన్లలో బ్యాటరీ బ్యాకప్ అద్భుతంగా వస్తుందని చెప్పవచ్చు.అలాగే ఆ ఫోన్లు చాలా వేగంగా కూడా చార్జింగ్ అవుతాయి.

ఇక త్వరలో రానున్న వన్‌ప్లస్ 6టి ఫోన్‌లో 3700 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు.ఇది గతంలో వచ్చిన వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీల కన్నా ఎక్కువే.

దీంతోపాటు బ్యాటరీని వేగంగా చార్జ్ చేసే డ్యాష్ చార్జింగ్ టెక్నాలజీ వన్ ప్లస్ ఫోన్లలో ఉంటుంది.కనుక బ్యాటరీ విషయంలో వన్‌ప్లస్ 6టి ఫోన్‌కు మొబైల్ వినియోగదారులు ఫిదా అయిపోక తప్పదు.

4.ఆండ్రాయిడ్ 9.0 పై


గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను విడుదల చేస్తుందని తెలిసిందే.అయితే ఈ ఓఎస్ అప్‌డేట్లు గూగుల్ పిక్సల్ ఫోన్లతోపాటు వన్‌ప్లస్ ఫోన్లకు చాలా వేగంగా వస్తాయి.

అందుకనే వన్‌ప్లస్ ఫోన్లను కొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తారు.ఇక త్వరలో రానున్న వన్ ప్లస్ 6టి ఫోన్‌లో ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్‌ను ఇవ్వనున్నారు.ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఇదే.కనుక వన్ ప్లస్ 6టి ఫోన్‌కు విపరీతమైన ఆదరణ ఏర్పడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube