పిట్టల్ని కొట్టబోతే అదుపు తప్పిన తుపాకి ! బాలుడి తలలోకి బుల్లెట్ దూసుకువెళ్లడంతో...?   One Young Boy Died Gun Misfire     2018-12-08   20:48:21  IST  Sai M

కొన్ని కొన్ని సంఘటనలు అనుకోకుండా … ఎవరూ ఊహించని విధంగా జరిగిపోతుంటాయి. విధి విచిత్రం అంటూ కొన్ని జేకొన్ని సంఘటనలను మనం గుర్తుతెచ్చుకుంటూ ఉంటాము. ఆ విధి విచిత్రమే ఓ తుపాకి గుండు రూపంలో దూసుకొచ్చింది. ఓ బాలుడి నిండు ప్రాణం తీసింది. పూర్తి వివరాలు పరిశీలిస్తే… కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో చోటు చేసుకుంది. శేరిధింటికుర్రు గ్రామంలో నాటు తుపాకీ గుండు అదుపు తప్పి చిటికనేని కరుణానిధి అనే బాలుడు చనిపోయాడు.

పాఠశాలకు సెలవు కావడంతో తన తండ్రితో కలిసి గేదెలను మేపేందుకు వెళ్లాడు. చెరువుగట్టుపై ఉన్న ఓ వ్యక్తి చేపల చెరువుపై పక్షులను తరిమేందుకు నాటు తుపాకిని కాల్చాడు. ఆ సమయంలో అక్కడే ఉండి తిలకిస్తున్న కరుణానిధికి పొరపాటున తుపాకీ గుండు తగిలింది. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే ప్రాణాలు కొల్పోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.