212 మంది రెడ్లు.. వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న పోస్టు

జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌ను ఇరుకున పెట్టే ఓ పోస్ట్‌ను వాట్సాప్‌లో వైరల్‌ చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు.జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవులన్నీ రెడ్డీల చేతుల్లోకి ఎలా వెళ్లిపోయాయో వివరిస్తోందీ సందేశం.

 One Whats App Post Against To Jagan Mohan Reddy-TeluguStop.com

జగన్‌ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర నామినేటెడ్‌ పోస్టులన్నీ కలిపితే మొత్తం 212 మంది రెడ్లకు పదవులు దక్కినట్లు ఈ పోస్ట్‌ చెబుతోంది.

మొత్తం 212 మంది పేర్లు, వాళ్ల హోదాలను కూడా ఇవ్వడం గమనార్హం.

ముఖ్యమంత్రి సహా నాలుగు మంత్రి పదవులు, చీఫ్‌ విప్‌, మూడు విప్‌లు, లోక్‌సభాపక్ష నేత, పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ చైర్మన్‌, ఏపీఐఐసీ చైర్మన్‌, తుడా చైర్మన్‌, సీఆర్డీఏ చైర్మన్‌, కేబినెట్‌ సబ్‌కమిటీలు.ఇలా అన్ని కీలక పదవులు ఇప్పుడు రెడ్డీల చేతుల్లోనే ఉన్నట్లు ఆ వాట్సాప్‌ పోస్ట్‌ స్పష్టం చేస్తోంది.

జగన్‌ రెడ్డి రాజ్యంలో అందరూ రెడ్లే అంటున్న ఈ పోస్ట్‌ ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్‌గా మారింది.అంతేకాదు చంద్రబాబు హయాంలో బీసీ, కాపు, బ్రాహ్మణ, ఎస్పీ కార్పొరేషన్ల పదవులను ఆయా సామాజికవర్గాల వాళ్లకే ఇచ్చారని, జగన్‌ మాత్రం మొత్తం రెడ్లతో నింపేశారని ఈ పోస్ట్‌లో విమర్శలు గుప్పించారు.

కొన్నాళ్లుగా ఏపీలో కమ్మ వర్సెస్‌ రెడ్డిగా రాజకీయాలు మారిపోయిన నేపథ్యంలో ఈ పోస్ట్‌కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది.

కులగజ్జి ఎవరికి ఉందో ఈ జాబితాతోనే అర్థమవుతోందంటూ టీడీపీ ఎదురు దాడికి దిగింది.

కళ్ల ముందు ఇంత స్పష్టంగా జాబితా కనిపిస్తుంటే జగన్మోహన్‌రెడ్డి ఇంకా ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube