ఎన్నికలకు దూరం అంటున్న ఆ గ్రామం !  

తెలంగాణాలో పోలింగ్ అన్ని చోట్ల రసవత్తరంగా సాగుతుంటే…సూర్యాపేట జిల్లాలోని ఓ గ్రామం మాత్రం తాము ఎన్నికలకు దూరం అంటూ…తమ నిరసనను తెలియజేశాయి. తమ గ్రామ అభివృద్ధి గురించి నాయకులు సక్రమంగా పట్టించుకోవడం లేదని దానికి నిరసన గానే మూకుమ్మడిగా ఎన్నికలను బహిష్కరించామని సూర్యాపేట జిల్లా కోదాడ రంగాపురం తండా గ్రామస్థులు చెబుతున్నారు.

One Villegers Boycott Voting At Telangana Elections-

One Villegers Boycott Voting At Telangana Elections

మరోవైపు కోదాడ కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈవీ రెడ్డి కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ లో అసౌకర్యాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈవీఎం వద్ద సరైన వెలుతురు లేదని, వీవీ ప్యాడ్ లపై అభ్యర్థుల పేరు, గుర్తు కనిపించడంలేదని ఆరోపించారు. ఈ విషయమై రిటర్నింగ్ అధికారితో ఆమె ఫోన్ లో మాట్లాడారు.