ఏపీలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి స్కూల్స్ కూడా ఓపెన్..!!

కరోనా వైరస్ దెబ్బకి మూతపడ్డ పాఠశాలలు మెల్లమెల్లగా ఓపెన్ అవుతున్నాయి.వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూతపడ్డ ప్రాథమిక పాఠ‌శాల‌ల‌ను రీ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం డిసైడ్ అయింది.

 Schools For One To Fifth Class Opening From February First In Ap, Corona Virus,c-TeluguStop.com

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల తీవ్రత తగ్గటంతో.సరికొత్త నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూనే పాఠశాలలు తెరవాలని ఏపీ విద్యాశాఖ డిసైడ్ అయింది.

ఈ క్రమంలో ఫిబ్రవరి మొదటి తారీకు నుంచి ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు బడులు ఓపెన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అదేవిధంగా ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా ఎంతమంది పిల్లలు హాజరవ్వాలి ఇటువంటి సమయాల్లో ఏ ఏ తరగతులు నిర్వహించాలి అన్నదానిపై యాజమాన్యం టైం టేబుల్ పాటించాలని సూచించింది.

అంతేకాకుండా ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని.పాఠశాల భవనాలు సరిపడని చోట రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు.

Telugu Andhra Pradesh, Corona Vaccine, Corona, February, Class, Schools-Latest N .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube