వండర్‌ : వెయ్యి ఏళ్ల లోహపు విగ్రహంలో ఉన్న అస్తిపంజరం, శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఆసక్తికర విషయాలు

తాజాగా చైనాలో బయట పడ్డ ఒక లోహపు బౌద్ద సన్యాసి విగ్రహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.ఈ లోహపు విగ్రహంను పురావస్తు శాఖ వారు స్కానింగ్‌ చేయగా లోపల స్కెలిటిన్‌ అంటే అస్థిపంజరం ఉందని గుర్తించారు.

 One Thousandyears Old Buddhagold Statuewith Skeletoninsidebody-TeluguStop.com

ఒక మనిషిని ఎక్స్‌ రే తీస్తే ఎలా అయితే ఎముకలు క్లీయర్‌గా కనిపిస్తాయో అలాగే ఈ లోహపు విగ్రహంను స్కానింగ్‌ చేసినా, ఎక్స్‌రే తీసినా కూడా అదే విధంగా ఎముకల గూడు కనిపిస్తుంది.ఇది ఒక అద్బుతంగా మొదట శాస్త్రవేత్తలు అనుకున్నారు.

అయితే ఆ తర్వాత వారికి తెలిసిన విషయం ఏంటీ అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని రాగి మరియు బంగారంతో తయారు చేసిన మిశ్రమంతో కప్పేయడం జరిగింది.పై కోటింగ్‌కు మనిషి ఆకారం ఇచ్చారు.

Telugu Chaina, Egypt, Thousandbuddha-

ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.ఒకప్పుడు ఈజిప్ట్‌లో చనిపోయిన వారి శవాలను దహనం లేదా ఖననం చేయకుండా రసాయనాలు పూరి ఆ శవాలను భద్రపర్చేవారు.ఈజిప్ట్‌లో కొన్ని లక్షల శరీరాలు ఇప్పటికి అలాగే ఉన్నాయని అంటూ ఉంటారు.అలా చేయడం వల్ల పునర్జన్మ ఉండటంతో పాటు, ఎక్కువ ఏళ్ల బతికినట్లు అవుతుందని వారి నమ్మకం.

ఒకప్పుడు ఈజిప్ట్‌కు మాత్రమే పరిమితం అయ్యిందనుకున్న డెడ్‌ బాడీల సంరక్షణ చైనా మరియు టిబెట్‌ ప్రాంతాల్లో వెయ్యి ఏళ క్రితమే జరిగిందని తాజాగా చైనాలో లభ్యం అయిన బౌద్ద సన్యాసి విగ్రహంను బట్టి అర్థం అయ్యింది.

ఇకపై లోహాలతో కనిపించిన ఏ విగ్రహంను అయినా స్కానింగ్‌ చేసి క్షుణంగా దాన్ని పరిశీలించనున్నారు.

బౌద్దులు ఒకప్పుడు సంవత్సరాల తరబడి యోగ ముద్రలో ఉండే వారు.ఆ సమయంలో వారు కేవలం గాలి మాత్రమే పీల్చుతే బతికేవారు.

అలాంటి బౌద్దులు ఇలా చనిపోయిన తర్వాత యోగ ఆసనంలోనే ఉండేవారు.అలా వారు ఉంటే వారికి లోహంతో తాపడం చేస్తారని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Telugu Chaina, Egypt, Thousandbuddha-

తాజాగా చైనా శాస్త్రవేత్తలకు దొరికిన లోహపు విగ్రహం మరియు ఆ లోపల ఉన్న స్కెలిటిన్‌ను ఒక బౌద్ద సన్యాసిది అయ్యి ఉంటుందని అంటున్నారు.ఇలా ఇంకా ఎంతో మంది సన్యాసులకు సంబంధించిన లోహపు విగ్రహాలు ఉండి ఉంటాయని చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.అందుకు సంబంధించిన అన్వేషణ ప్రారంభం అయ్యింది.అయితే ఇక్కడ లభించిన బౌద్ద సన్యాసి టిబెట్‌కు చెందిన వ్యక్తి అయ్యి ఉంటాడనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

టిబెట్‌లో ఎక్కువగా బౌద్ద సన్యాసులు ఉండే వారు.కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడ బౌద్దులు ఉన్నట్లుగా ఛారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి.

కనుక బౌద్య సన్యాసులు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలోనే ఇలా లోహపు విగ్రహాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.టిబెట్‌లో చైనా పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోదనలు చేసేందుకు ప్రయత్నాలు చేయవచ్చు.

ఒక మనిషి చనిపోయిన తర్వాత తన బౌతిక దేహంను కాపాడుకోవాలని అనుకుంటూ ఉంటాడు.ప్రతి మనిషి కూడా తాను చనిపోయినా కూడా తన శరీరం మిగిలి పోవాలని అనుకుంటూ ఉంటారు.

అలా బౌద్ద సన్యాసులు కూడా భవిష్యత్తు తరాల వారికి తాము చెప్పాలనుకున్న విషయాలను చెప్పేందుకు ఇలా శిల రూపంలో మారి ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే వారు చెప్పాలనుకున్న ఆ విషయం ఏంటీ అనేది శాస్త్రవేత్తలు తెలుసుకోవాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube