నిజంగానే సోనూసూద్‌ కు రాజ్యసభ సీటు ఆఫర్‌ వచ్చిందా?

సినీ నటుడు కమ్‌ కోవిడ్‌ హీరో సోనూసూద్‌ కు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ ఏడాదిన్నర కాలంలో ఆయన టాలీవుడ్‌ స్టార్‌ హీరోలను మాత్రమే కాకుండా బాలీవుడ్‌ హీరోలను కూడా స్టార్‌ డమ్‌ లో కాకుండా రియల్‌ స్టార్‌ ఇమేజ్ లో మించి పోయాడు.

 One Political Party Offers Rajya Sabha Seat For Sonu Sood-TeluguStop.com

అద్బుతమైన తన మంచి మనసుతో చేసిన సాయం అంతా ఇంతా కాదు.అందుకు సంబంధించి ఆయన జనాల నుండి పొందుతున్న గౌరవం అంతా ఇంతా కాదు.

జనాల్లో చాలా మంది ఇప్పుడు ఆయన ప్రధాన మంత్రిగా పని చేయాలని కోరుకుంటున్నారు.ప్రధానిగా ఆయన పోటీ చేస్తే నా ఓటు ఆయనకే అంటూ చాలా మంది సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

 One Political Party Offers Rajya Sabha Seat For Sonu Sood-నిజంగానే సోనూసూద్‌ కు రాజ్యసభ సీటు ఆఫర్‌ వచ్చిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆయన్ను పలు రాజకీయ పార్టీలు ఓన్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.పలు రాజకీయ పార్టీలు ఆయన్ను తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు.

కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఆయనకు అత్యున్నత పదవులను కూడా ఆఫర్‌ చేస్తున్నారు.

తాజాగా సోనూసూద్‌ ను ఒక ప్రముఖ రాజకీయ పార్టీ రాజ్య సభకు పంపించేందుకు సిద్దం అయ్యిందట.

అందుకు గాను సోనూసూద్‌ ను సంప్రదించారని.తమ పార్టీ తరపున రాజ్య సభ కు పంపిస్తామని.

తమ పార్టీలో జాయిన్ కానవసరం లేదు అంటూ ఆ పార్టీ ఆఫర్‌ చేసిందట.మీలాంటి వారు రాజ్య సభలో ఉండాలని.

మా పార్టీ తరపున అక్కడ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని ముందుగానే పేర్కొన్నారట.

Telugu Bollywood, Covid Hero, Film News, Political Party, Rajya Sabha, Real Hero Sonu Sood, Sonu Sood, Sonusood Rajya Sabha Offer, Sonusood Rejected-Movie

అయినా కూడా రాజ్య సభ సీటును సోనూసూద్‌ తిరస్కరించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇటీవల రాజ్య సభ్యడు ఆఫర్‌ గురించి స్వయంగా సోనూ సూద్‌ స్పందించాడు.తనకు వస్తున్న పొలిటికల్‌ ఆఫర్ల గురించి ఆసక్తి లేదని.

కొందరు కొన్ని ఆఫర్లు చేస్తున్నారు కాని నేను ఇప్పుడు సినిమాల పై కాకుండా మరే విషయమై దృష్టి పెట్టాలనుకోవడం లేదు అంటూ స్పష్టంగా చెప్పేశాడు.

#Rajya Sabha #Sonu Sood #Sonusood #Sonu Sood #Covid

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు