One Plus 13: వన్ ప్లస్13 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఆన్ లైన్లో లీక్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్12 స్మార్ట్ ఫోన్ యొక్క తర్వాతి వెర్షన్ వన్ ప్లస్13 స్మార్ట్ ఫోన్ ( One Plus 13 ) ఫీచర్లు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.ఈ ఫోన్ ముందుగా చైనా( China ) మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉండే మార్కెట్లను అందుబాటులోకి రానుంది.

 One Plus 13 Smart Phone Features Leaked Online How Are The Features-TeluguStop.com
Telugu China, Smart Phone, Ultra Lens-Technology Telugu

వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్:

క్వాల్కమ్ యొక్క తదుపరి తరం స్నాప్ డ్రాగన్ 8Gen 4చిప్ సెట్( Snapdragon 8Gen 4 Chipset ) తో వస్తుంది.ఈ ఫోన్ డిస్ ప్లే లో అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పొందుపరిచారు.ఈ ఫోన్ డిజైన్ ప్రకారం కెమెరాలు నిలువుగా సమలేఖనం చేయబడిన ట్రిపుల్ కెమెరా సెటప్ తో రానుంది.వన్ ప్లస్ క్లబ్ X ఖాతాలో వన్ ప్లస్ 13 యొక్క ఉహించని రెండర్ లను షేర్ చేసింది.

ఈ రెండర్ లో ఫోన్ యొక్క వెనుక భాగంలో Hasselblad- బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వైట్ షేడ్ లో హ్యాండ్ సెట్ ను చూపుతుంది.ఇందులో కెమెరా సెన్సార్లు నిలువుగా అమర్చబడి, మధ్య సెన్సార్ అత్యంత ప్రముఖంగా ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ 2k రిజాల్యూషన్ డిస్ ప్లే తో ఉంటుంది.అల్ట్రా వైడ్ లెన్స్, టెలిఫోటో సెన్సార్ ( Ultra wide lens, telephoto sensor )తో పాటు 50- మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాలతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.

Telugu China, Smart Phone, Ultra Lens-Technology Telugu

ఒకసారి వన్ ప్లస్12 స్మార్ట్ ఫోన్ ఫీచర్లను గమనిస్తే.6.82 అంగుళాల క్వాడ్ LTPO 4.0 AMOLED స్క్రీన్ కలిగి, స్నాప్ డ్రాగన్ 8Gen 3 SoC ప్రాసెసర్ పై పని చేస్తుంది.5400mAh బ్యాటరీ సామర్థ్యంతో 100w సూపర్ ఊక్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.సోనీ LYT-808 సెన్సార్ తో కూడిన 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ద్వారా రియల్ కెమెరా సెటప్ తో ఆమార్చబడింది.12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64999 గా ఉంది.16GB RAM+ 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69999 గా ఉంది.వన్ ప్లస్13 స్మార్ట్ ఫోన్ ధరల విభాగం కూడా ఇంచుమించు ఇలాగే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube