విద్యార్థి ప్రశ్న : మోడీజీ 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా' అవ్వడం ఎలా?

నిన్న జరిగిన చంద్రయాన్‌ 2 ప్రయోగం తుది అంకంను బెంగళూరులోని స్పెస్‌ సెంటర్‌లో కూర్చుని చూసేందుకు దేశ వ్యాప్తంగా రాష్ట్రానికి ఇద్దరు విద్యార్థుల చొప్పున ఇస్రో అవకాశం ఇచ్చింది.పలు క్విజ్‌ కార్యక్రమాలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి ఈ ఛాన్స్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.

 One Of Thestudent Asking A Question To Modi How To Became A Prime Minister-TeluguStop.com

ఆ విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఈ ప్రయోగాన్ని విక్షించారు.చంద్రయాన్‌ 2 ప్రయోగం చివరి క్షణాల్లో ల్యాండర్‌ విక్రమ్‌లో సాంకేతిక సమస్య రావడంతో స్పెస్‌ సెంటర్‌తో కనెక్షన్స్‌ తెగి పోయింది.

ఆ సమయంలో విద్యార్థులు నిరుత్సాహపడకుండా వారిలో పీఎం మోడీ స్ఫూర్తిని నింపారు.</br>

ఆ సమయంలో విద్యార్థులతో మోడీ ముచ్చటించారు.

ఆ సమయంలో ఒక విద్యార్థి మోడీతో మాట్లాడుతూ ”మోడీజీ నాకు రాష్ట్రపతి అవ్వాలని ఉంది, దాన్ని చేరుకోవడం ఎలా’ అంటూ ప్రశ్నించాడు.ఆ విద్యార్థి ప్రశ్నకు మోడీ నవ్వుతూ రాష్ట్రపతి ఎందుకు ప్రధాని అవ్వాలని ఎందుకు లేదు అంటూ ప్రశ్నించాడు.

ఆ విద్యార్థి ప్రశ్నకు సమాధానంగా నీవు అనుకున్నదాన్ని సాధించేందుకు నీ లక్ష్యంను చిన్న భాగాలుగా విభజించి ఆ తర్వాత సాధించు.ఆ క్రమంలో నీవు ఎదుర్కొన్న అపజయాలను మర్చి పో అంటూ సూచించాడు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆ విద్యార్థి ప్రశ్న తెగ వైరల్‌ అవుతోంది.ఆ విద్యార్థి ప్రశ్నకు మోడీ చెప్పిన సమాధానం అమోగం అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube