చంద్రయాన్‌ -2 95% సఫలం, 5% విఫలం

నిన్న మద్యరాత్రి వరకు దేశ ప్రజలు అంతా కూడా ఉత్కంఠతతో ఎదురు చూసిన చంద్రయాన్‌ 2 ప్రయోగం విఫలం అవ్వడంతో అంతా నిరాశను వ్యక్తం చేస్తున్నారు.కొద్ది తేడాతో చంద్రుడిపై అడుగు పెట్టడంలో ఇస్రో శాస్త్రవేత్తలు విఫలం అయ్యారంటూ వారిపై జాలి చూపుతూ బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ టైం అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

 One Of Theisro Scientiest Comments On Chandrayan 2 Tstop-TeluguStop.com

అయితే ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా స్పందిస్తూ చంద్రయాన్‌ 2 విఫలం అవ్వలేదని, 5 శాతం మాత్రమే విఫలం అయ్యిందని, 95 శాతం చంద్రయాన్‌ 2 సక్సెస్‌ అయ్యిందని అంటున్నారు.చంద్రుడిపై తాము పంపిన ఆర్బిటర్‌ చక్కర్లు కొడుతూ తన పని చేస్తుందని, అది విజయవంతం అయ్యిందని అన్నాడు.

</br>

ఇక ల్యాండర్‌ విక్రమ్‌ను చేరుకునేందుకు సాగుతున్న ప్రయత్నాల గురించి ఒక శాస్త్రవేత్త మీడియాకు వివరిస్తూ ఇకపై విక్రమ్‌ నుండి ఎలాంటి సంకేతాలు అందుతాయనే నమ్మకం తమకు లేదని, అలాగే ప్రజ్ఞాన్‌ రోవర్‌ను కూడా కోల్పోయినట్లే అంటూ తేల్చి చెప్పారు.భారత శాస్త్రవేత్తలు చాలా కష్టపడి చేసిన విక్రమ్‌ ల్యాండర్‌ మరియు ప్రజ్ఞాన్‌ రోవర్‌లను ఇండియా కోల్పోయినట్లే అంటూ వారు చెబుతున్నారు.ఈ ప్రయోగం విఫలం అవ్వడంతో రూ.978 కోట్లు వృదా అయినట్లుగా భావించనక్కర్లేదు అంటూ ఇస్రో ప్రకటించింది.ఇలాంటి ప్రయోగాలకు ముందు ముందు ఈ ప్రయోగం ఒక గుణపాఠంగా నిలిచే అవకాశం ఉందని వారు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube