అయ్యో పాపం : అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ బకరాలు అయ్యారు

అల్లు అర్జున్‌కు సోషల్‌ మీడియాలో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఫేస్‌బుక్‌.

 One Of The Allu Arjun Fan Play The Fraud Game With Allu Fans-TeluguStop.com

ఇన్‌స్టాగ్రామ్‌.ట్విట్టర్‌ ఇలా అన్ని చోట్ల కూడా మిలియన్‌లకు మిలియన్‌ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

బన్నీ పేరు మీద ఫ్యాన్‌ పేజీలు కూడా భారీగా ఉంటాయి.సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ చాలా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆయన అభిమానులు కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆపదలో ఉన్న వారికి వారు సాయం చేయడం లేదంటే బన్నీతో చేయించడం చేస్తూ ఉంటారు.

Telugu Allu Arjun, Alluarjun, Naveen-

  బన్నీ ఫ్యాన్స్‌ మంచితనంను వినయ్‌ అనే వ్యక్తి అలుసుగా తీసుకుని ఒక కథ అల్లాడు.అమెరికాలో అల్లు అర్జున్‌ ఫ్యాన్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు.ప్రస్తుతం అతడు హాస్పిటల్‌లో చికిత్స పొందుడుతున్నాడు.అతడి చికిత్సకు డబ్బులు అవసరం అంటూ పోస్ట్‌ చేశాడు.అల్లు అర్జున్‌ వీరాభిమాని అనగానే బన్నీ ఇతర ఫ్యాన్స్‌ కూడా రియాక్ట్‌ అయ్యారు.వినయ్‌ హాస్పిటల్‌ ఖర్చుల కోసం అంటూ ఎవరికి ఇష్టం వచ్చినంత వారు ఇచ్చారు.

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఒకరిని చూసి ఒకరు అన్నట్లుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

Telugu Allu Arjun, Alluarjun, Naveen-

  అల్లు అర్జున్‌పై అభిమానం ఉన్న వారు కనీసం 10 రూపాయలైనా సాయం చేయండి అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టడంతో అంతా కూడా స్పందించారు.దాదాపుగా 4.5 లక్షల రూపాయలు సేకరించాడట.అయితే తీరా చూస్తే వినయ్‌ అనే వ్యక్తికి ఏం కాలేదు.అసలు అతడు అంతా బాగానే ఉన్నాడు.కొన్ని రోజులుగా బన్నీ గురించి పోస్ట్‌లు పెడుతూ సమయం చూసి యాక్సిడెంట్‌ డ్రామా ఆడి డబ్బులు లాగాడు.అతడిపై ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్‌ తీవ్ర కోపంతో ఉన్నారు.

ప్రస్తుతం అతడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube