జూన్‌ 1న దేశ వ్యాప్తంగా ప్రారంభం

మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు విధానంను జూన్‌ 30 నుండి దేశ వ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లుగా కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ ప్రకటించారు.ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్ట్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా కొన్ని రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఈ విధానంను జూన్‌ 30 తర్వాత దేశ వ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లుగా ఈ సందర్బంగా మంత్రి ప్రకటించారు.

 One Nation One Ration Card June-TeluguStop.com

ఈ ప్రకటనతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న పేద వారికి మంచి జరుగుతుంది.

ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు అసలు ఉద్దేశ్యం ఏంటీ అంటే ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ను కార్డు ఉన్న వారు దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చు.

వలస వెళ్లిన వారు రేషన్‌ను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.కాని ఇకపై అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు.దేశంలో ఎక్కడున్నా కూడా తమ రేషన్‌ను తాము తీసుకునే అవకాశం మద్య తరగతి వారికి బీద వారికి దక్కుతుంది.దీన్ని మొదట జూన్‌ 30న అమలు చేయాలని భావించారు.

కాని అన్ని ఏర్పాట్లు పూర్తి అయిన కారణంగా నెల ముందే అంటే జూన్‌ 1నే ప్రారంభించాలని నిర్ణయించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube