లాక్ డౌన్ టైటిల్ తో తెలుగులో మరో సినిమా… వలస కూలీనే హీరో  

One More Telugu Cinema On Lock Down - Telugu Corona Effect, Dileepraja, Lock Down,, Telugu Cinema, Tollywood

కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.అందరూ ఇళ్లకే పరిమితం అయిపోయారు.

 One More Telugu Cinema On Lock Down

అయితే వలస కూలీలు మాత్రం రోడ్డెక్కారు.వేల మైళ్ళు కాలినడకన నడుచుకొని సొంత ఊళ్ళ బాట పట్టారు.

ఈ వలసకూలీల బాధలు లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించాయి.ఈ నేపధ్యంలో లాక్ డౌన్ కష్టాలు, కరోనా నేపధ్యంలో దర్శకులకి కొత్త కథలు దొరికాయి.

లాక్ డౌన్ టైటిల్ తో తెలుగులో మరో సినిమా… వలస కూలీనే హీరో-Movie-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలో ఇప్పటికే తెలుగులో ఆర్జీవీ, ప్రశాంత్ వర్మ కరోనా ఎలిమెంట్ తో సినిమాలు తీస్తున్నారు.ఇక లాక్ డౌన్ నేపధ్యంలో ఒక హైదరాబాదీ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

ఇప్పుడు మరో దర్శకుడు లాక్ డౌన్ టైటిల్ తో సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు.ఇక ఆ సినిమాలో వలస కూలీనే హీరోగా పెట్టబోతున్నట్లు చెప్పి అందరికి ఆసక్తి పెంచాడు.

పండుగాడు ఫొటో స్టూడియో తో దర్శకుడు దిలీప్‌రాజా ఎంట్రీ ఇస్తున్నాడు.తన నెక్స్ట్ సినిమా లాక్‌డౌన్‌ అనే టైటిల్‌తో వస్తుందని వెల్లడించారు.లాక్‌డౌన్‌ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌కు కేంద్ర సెన్సార్‌ బోర్డ్‌ ఆమోదం ఇచ్చినట్లుగా దిలీప్‌రాజా తెలిపారు.ఈ సినిమాను విజయ బోనెల, ప్రదీప్‌ దోనూపూడి నిర్మించనున్నారు.

ఈ లాక్‌డౌన్‌ సినిమా గురించి దిలీజ్‌ రాజా మాట్లాడుతూ కరోనా వైరస్‌ నుంచి తమను తాము కాపాడుకుంటూ మరోవైపు గమ్యస్థానానికి బయలుదేరిన వలసకూలీల బతుకు చిత్రమే లాక్‌డౌన్‌ కథ అని చెప్పాడు.ఈ చిత్రంలో వలస కార్మికుడే హీరో.

కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలనే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి అని పేర్కొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

One More Telugu Cinema On Lock Down Related Telugu News,Photos/Pics,Images..

footer-test