'ఆచార్య' నుండి మరో టీజర్‌ రాబోతుందట, ఎప్పుడో తెలుసా?

మెగా స్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.మేరేడు మిల్లి ప్రాంతంలో జరిగిన తాజా షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరిపారు.

 One More Teaser Coming From Chiranjeevi Ram Charan Acharya Movie  , Acharya Movi-TeluguStop.com

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆచార్య సినిమా లో చిరంజీవితో పాటు రామ్‌ చరణ్‌ కూడా నటిస్తున్న కారణంగా అంచనాలు మరింతగా ఉన్నాయి.అంచనాలు తగ్గట్లుగా కొరటాల శివ సినిమా ను మరో రేంజ్ లో రూపొందిస్తున్నాడు.

ఇటీవల విడుదల అయిన టీజర్‌ ను బట్టి సినిమా స్థాయిని పెంచడం జరిగింది.ఇక ఈ సినిమా నుండి మరో టీజర్ కూడా రాబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్‌ మరియు చరణ్‌ లు నటిస్తున్న ఆర్‌ఆర్ఆర్ సినిమా నుండి రెండు టీజర్‌ లు వచ్చాయి.అలాగే ఆచార్య నుండి కూడా రెండు టీజర్లు వస్తాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Telugu Acharya, Acharya Teaser, Chiranjeevi, Kajal, Ram Charan, Sidda Role-Movie

మొదటి టీజర్ లో చిరంజీవి లుక్ మరియు డైలాగ్‌ తో దుమ్ము లేపారు.ఆచార్య టీజర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో చరణ్‌ తో ఒక టీజర్‌ తీసుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.ఈ నెలలో చరణ్‌ బర్త్‌ డే ఉంది.కనుక కొత్త టీజర్ ను రెడీ చేస్తున్నారట.బర్త్‌ డే సందర్బంగా టీజర్‌ ను విడుదల చేసి అభిమానులకు కానుక ఇవ్వాలని కొరటాల భావిస్తున్నాడు.ఆచార్య సినిమా లో సిద్ద రెడీ అవుతున్నాడు అంటూ కొరటాల శివ నిన్న ట్వీట్‌ చేశాడు.

దాన్ని బట్టి ఆయన పుట్టిన రోజుకు టీజర్‌ రాబోతుంది అన్నట్లుగా సమాచారం అందుతోంది.ఆచార్య సినిమా లో చిరంజీవి మరియు చరణ్‌ లు ఎలా కనిపించబోతున్నారు, వారి మద్య ఉండే బంధం ఏంటీ అనే విషయాన్ని ట్రైలర్‌ లో రివీల్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube