సమంత ప్రెగ్నెంట్ అంటూ మళ్లీ ప్రచారం.. అసలు విషయం ఇది!

ఒక్కోసారి ప్రశంసలతో పాటు విమర్శలు, తప్పుడు ప్రచారాలు మరో కొత్త వివాదానికి కూడా దారి తీసే అవకాశాలుంటాయి.చిత్ర పరిశ్రమలో ఇవన్నీ కామన్ అయినప్పటికీ… కొన్ని సంఘటనలు మాత్రం.

 One More Rumour On Samantha And Chaitu Relation-TeluguStop.com

రోజు రోజుకీ మరో కొత్త విషయంతో బయటికి వస్తూనే ఉంటాయి.గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగచైతన్య, సమంతల వివాహబంధంపై అనేక విధాలుగా ట్రోల్ అవుతున్న విషయం తెలిసిందే.

సమంత తన ట్విట్టర్ అకౌంట్‌లో అక్కినేని అని ఎప్పుడైతే తీసేసిందో.అప్పటి నుంచి ఈ ప్రచారం మొదలయ్యింది.

 One More Rumour On Samantha And Chaitu Relation-సమంత ప్రెగ్నెంట్ అంటూ మళ్లీ ప్రచారం.. అసలు విషయం ఇది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత నాగ్ పుట్టినరోజు వేడుకలలో కూడా ఆమె కనిపించకపోవడంతో ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరింది.నాగచైతన్య, సమంత విడిపోతున్నారని.త్వరలోనే వారు విడాకులు తీసుకుంటున్నారంటూ గాసిప్స్ మొదలయ్యాయి.ఇదిలా ఉండగా వీరిద్దరిపై మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే సమంత ప్రెగ్నెంట్ అంటూ తాజాగా ఓ ప్రచారం వ్యాప్తి చెందుతూ ఉంది.సమంత ప్రస్తుతం నటించిన శాకుంతలం అనే చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సినిమా తర్వాత ఇంత వరకు ఆమె మరో సినిమాకు సైన్ చేసినట్లుగా వార్తలైతే ఏమీ రాలేదు.

ఇటీవల బాలీవుడ్‌‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చారు.అలాగే చైతూ నటించిన లవ్ స్టోరి ట్రైలర్‌పై కూడా ట్విట్టర్ వేదికగా సమంత స్పందించడం, దీనికి చైతూ థ్యాంక్స్ చెప్పడం వంటివి వారిపై వస్తున్న రూమర్స్‌లో ఎటువంటి నిజం లేదనేలా చేశాయి.

Telugu Chaitanya, Love Story Movie, Nagarjuna, Samantha, Samantha Pregnant, Shakunthalam Movie, Tollywood-Movie

అయితే సమంత రెస్ట్ తీసుకోవడానికి కారణం ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అనిఅందుకే కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా ఇప్పుడు వార్తలు మొదలయ్యాయి.త్వరలోనే వారు అభిమానులకు ఓ శుభవార్త చెప్పబోతున్నారని టాక్.ఇలా ప్రచారమవుతున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.

ఇది నిజమైతే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీలవ్వడం మాత్రం ఖాయం.విడాకుల విషయంపై ఇప్పటికీ ఆ ఫ్యామిలీ ఎలాంటి స్పందనా ఇవ్వలేదు.

కనీసం ఈ తాజా రూమర్స్‌ పైనైనా చైతూ, సామ్ లలో ఎవరైనా స్పందిస్తారేమో చూద్దాం.

#Chaitanya #Love Story #Shakunthalam #Samantha #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు