తాజాగా టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో మరో ఘనతను సొంతం చేసుకున్నాడు.ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరు పై మార్చుకున్న విరాట్ కోహ్లీ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇది వరకు సచిన్ పేరుతో ఉన్న రికార్డును తాజాగా విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
వన్డేలలో అత్యంత వేగంగా 12 వేల పరుగులను సాధించిన వ్యక్తిగా విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు.
సచిన్ 300 వన్డే మ్యాచ్ లలో 12 వేల పరుగులను సాధిస్తే అదే ఘనతను విరాట్ కోహ్లీ కేవలం 251 వన్డేలలో ని సాధించడంతో ఈ ఘనత విరాట్ కోహ్లీ కి దక్కింది.ప్రస్తుతం వన్ డే లలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 59 పైగా కొనసాగుతోంది.
ఇప్పటివరకు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వేదికగా వన్డేలలో 43 సెంచరీలను సాధించాడు.పరిమిత ఓవర్ల లలో తనకు తానే సాటి అన్నట్టుగా విరాట్ కోహ్లీ ప్రత్యర్థి దేశం ఏదైనా సరే తన బ్యాట్ తో సమాధానం చెబుతాడు.
రికార్డు మీద రికార్డులు రాస్తూ తన క్రికెట్ కెరీర్ ను ఓ స్థాయిలో కొనసాగిస్తున్నాడు విరాట్ కోహ్లీ.విరాట్ కోహ్లీ కేవలం 12000 పరుగుల మైలురాయిని అతి త్వరగా సాధించడం మాత్రమే కాకుండా వన్డేలలో అత్యధిక వేగంగా 8000, 9000, 10000, 11000 సాధించిన క్రికెటర్ విరాట్ కోహ్లీ అందరికంటే ముందు ఉన్నాడు.ఇకపోతే తాజాగా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో మ్యాచ్ లో టీమ్ ఇండియా జట్టు నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు సాధించింది.టీం ఇండియా బ్యాట్స్మెన్స్ లో హార్దిక్ పాండ్య 76 బంతులలో 92 పరుగులు చేసి అజేయంగా నిలవగా.
కోహ్లీ, జడేజా హాఫ్ సెంచరీలు చేశారు.