ఆచార్య మూవీ ఫ్లాప్ వెనుక అసలు కారణమిదా.. గ్యాప్ కూడా ఇవ్వలేదంటూ?

ఆచార్య మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.ఆచార్య సినిమాను కొనుగోలు చేసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు గాడ్ ఫాదర్ రైట్స్ ఇవ్వాలని చిరంజీవి భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

 One More Reason Behind Acharya Movie Flop Details Here Goes Viral  Acharya, Chir-TeluguStop.com

ఆచార్య డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునే దిశగా మేకర్స్ ఇప్పటికే అడుగులు వేస్తున్నారు.అయితే గ్యాప్ లేకుండా వరుసగా మెగా సినిమాలు విడుదల కావడం కూడా ఆచార్య సినిమా ఫ్లాప్ కు ఒక కారణమని మెగా అభిమానులు చెబుతున్నారు.

ఫిబ్రవరి నెలలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమాను మెగా ఫ్యాన్స్ ఆదరించారు.ఏపీలో టికెట్ రేట్లను తగ్గించకుండా ఉండి ఉంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కళ్లు చెదిరే రికార్డులను సొంతం చేసుకుని ఉండేదని చెప్పవచ్చు.ఆ తర్వాత విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంది.

అయితే ఆర్ఆర్ఆర్ విడుదలైన కొన్ని రోజుల గ్యాప్ లోనే గని, ఆచార్య సినిమాలు విడుదలయ్యాయి.

Telugu Acharya, Bheemla Nayak, Chiran Jeevi, Flop Result, Pawan Kalyan, Radhyash

సాధారణ సమయాల్లో ఈ సినిమాలు విడుదలై ఉంటే ఈ సినిమాల ఫలితాలు వేరే విధంగా ఉండేవి.ఆర్ఆర్ఆర్ తర్వాత రిలీజైన సినిమాలు అంటే మెగా ఫ్యాన్స్ లో కుడా అంచనాలు భారీగా పెరుగుతాయి.అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమాలు ఫెయిలయ్యాయి.

అందువల్లే ఆచార్య సినిమాకు భారీగా నష్టాలు వచ్చాయి.సాధారణంగా సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే కలెక్షన్లు వస్తాయి.

Telugu Acharya, Bheemla Nayak, Chiran Jeevi, Flop Result, Pawan Kalyan, Radhyash

రాధేశ్యామ్ సినిమా ఫ్లాప్ టాక్ తో కూడా ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే కలెక్షన్లను సాధించింది.అయితే వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.ఆచార్య సినిమా విషయంలో రిలీజైన రోజు నుంచి కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి.ఆచార్య మూవీ పుంజుకుని భారీస్థాయిలో కలెక్షన్లు సాధించే పరిస్థితులు లేవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube