స్టార్ హీరో అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన రికార్డ్.. ఏం జరిగిందంటే?

One More Rare Record Tollywood Star Hero Allu Arjun Account

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత రెండు సంవత్సరాల నుంచి సెల్ఫ్ ప్రమోషన్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది.

 One More Rare Record Tollywood Star Hero Allu Arjun Account-TeluguStop.com

సినిమా విశేషాలతో పాటు బన్నీ కుటుంబానికి సంబంధించిన విశేషాలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు.

స్టార్ హీరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

 One More Rare Record Tollywood Star Hero Allu Arjun Account-స్టార్ హీరో అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన రికార్డ్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బన్నీ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 15 మిలియన్లు కావడం గమనార్హం.దక్షిణ భారతదేశంలో ఈ స్థాయిలో ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరో అల్లు అర్జున్ కాగా కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలకు కనీసం 5 మిలియన్ల ఫాలోవర్లు కూడా లేరు.2020 సంవత్సరంలో అల వైకుంఠపురములో మూవీతో 2021లో పుష్ప ది రైజ్ తో బన్నీ విజయాలను అందుకున్నారు.

బన్నీ ఖాతాలో అరుదైన రికార్డులు చేరుతుండటం అభిమానులను సంతోషపెడుతోంది.

అల్లు అర్జున్ సైతం ఈ అరుదైన రికార్డు సొంతం కావడం గురించి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Telugu Followers, Allu Arjun, Alluarjun, Bunny Fan, Icon Allu Arjun, Pushpa, Rare, Tollywood-Movie

ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కు బన్నీ ధన్యవాదాలు తెలిపారు.బన్నీ నటించిన పుష్ప ది రైజ్ 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది.కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో బన్నీ ఈ రికార్డును సాధించడం గమనార్హం.

Telugu Followers, Allu Arjun, Alluarjun, Bunny Fan, Icon Allu Arjun, Pushpa, Rare, Tollywood-Movie

ఏపీలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండి ఉంటే కలెక్షన్ల రికార్డులు మరింత ఎక్కువగా ఉండేవనే కామెంట్లు వినిపిస్తున్నాయి.2021 సంవత్సరంలో విడుదలైన సినిమాలలో పుష్ప ది రైజ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకుంది.

#Allu Arjun #Bunny Fan #Arjun Followers #Icon Arjun #Followers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube