బాలయ్య ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ఈ జనరేషన్ లో బాలయ్యకు మాత్రమే సాధ్యమా?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్యకు రాయలసీమలో వీరాభిమానులు ఉన్నారు.బాలయ్య ఫ్లాప్ సినిమాలు సైతం రాయలసీమలో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నాయి.

 One More Rare Record In Balakrishna Account Details Here Goes Viral , Bhagavanth-TeluguStop.com

వీరసింహారెడ్డి మూవీ తాజాగా 175 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ఒక థియేటర్ లో 175 రోజుల పాటు ప్రదర్శించబడింది.

బాలయ్య నటించిన అఖండ మూవీ( Akhanda movie ) కూడా థియేటర్లలో ఎక్కువరోజుల పాటు ప్రదర్శించబడిందిబ్యాక్ టు బ్యాక్ బాలయ్య సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకోవడంతో బాలయ్య ఖాతాలో చేరింది.ప్రస్తుత కాలంలో దేశంలోనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్న హీరోలలో బాలయ్య ఒకరు.కర్నూలు జిల్లాలోని ఆలూరులో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ థియేటర్ లో వీరసింహారెడ్డి ( Veera Simha Reddy )175 రోజుల పాటు ప్రదర్శించబడింది.175 రోజుల వరకు ఈ సినిమా భారీ ఆక్యుపెన్సీతో ప్రదర్శితమైంది.

Telugu Akhanda, Anil Ravipudi, Bala Krishna, Balakrishna, Tollywood-Movie

సీ సెంటర్ లో బాలయ్య నటించిన సినిమాకు అరుదైన ఘనత దక్కడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.బాలయ్య తర్వాత సినిమాలతో కూడా అరుదైన ఘనతలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బాలయ్య ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ విజయాలను అందుకోలేదు.భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య ఆ లోటును సైతం భర్తీ చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Akhanda, Anil Ravipudi, Bala Krishna, Balakrishna, Tollywood-Movie

బాలయ్య మాస్ రోల్స్ లో నటిస్తుండగా ఊరమాస్ రోల్స్ తో బాలయ్యకు భారీగా క్రేజ్ పెరుగుతోంది.బాలయ్య( Blakrishna ) మల్టీస్టారర్స్ పై ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.బాలయ్య రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.బాలయ్య తన ప్రతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బాలయ్య భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాలో కామెడీ టైమింగ్ తో మెప్పిస్తారని సమాచారం అందుతోంది.సిల్వర్ జూబ్లీ రికార్డ్ విషయంలో స్టార్ హీరో బాలయ్య సీనియర్ స్టార్ హీరోలలో నంబర్ వన్ హీరోగా నిలిచారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube