తెలుగులో మరో కొత్త ఓటీటీ... న్యూస్ ఛానల్ నుంచి

ప్రస్తుతం మార్కెట్ లో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా ఎక్కువైంది. ఆన్ లైన్ లో ఒటీటీ సంస్థల ఆధిపత్యం మొదలైంది.

 One More Ott Platform To Float For Telugu Audience, Digital Entertainment, Tv5,-TeluguStop.com

ఇప్పటికే చాలా ఓటీటీ యాప్ లో అందుబాటులో ఉండి ఎంటర్టైన్మెంట్ రంగాన్ని శాసించడానికి రెడీ అయిపోయాయి.బాలీవుడ్ లో చాలా సినిమాలు ఇప్పటికే ఒటీటీ బాట పట్టేసాయి.

ఇక కొంత మంది ఒటీటీ యాప్ ల కోసం వెబ్ మూవీలు నిర్మించడానికి కూడా సమాయత్తం అవుతున్నారు.మరో వైపు వెబ్ సిరీస్ లకి కూడా డిమాండ్ పెరిగింది.

స్టార్ దర్శకులు సైతం భవిష్యత్తుని శాసించబోయే ఒటీటీలోకి వెబ్ సిరీస్ ల ద్వారా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు.ఇక తెలుగులో కూడా అల్లు అరవింద్ ముందుగానే మేల్కొని ఆహా అనే ఒటీటీ యప్ ని అందుబాటులోకి తీసుకొచ్చి వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నాడు.

అలాగే చిన్న సినిమాలని డిజిటల్ రిలీజ్ చేస్తున్నాడు.

మరో వైపు రామ్ గోపాల్ వర్మపుణ్యమా అని ఏటీటీ చానల్స్ రంగంలోకి వచ్చాయి.

పే ఫర్ మూవీ ఆప్షన్ ద్వారా వీటిలో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే శ్రేయాస్ ఈటి, భీమవరం టాకీస్ అనే ఏటిటిలు కూడా వచ్చాయి.ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా సొంత ఓటిటిని ప్రారంభించే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది.సినిమా అంతా థియేటర్స్ నుంచి ఒటీటీలోకి షిఫ్ట్ అవుతూ ఉండటంతో అక్కడ కూడా తమ హవా కొనసాగించేందుకు వీటి మీద పెట్టుబడులు పెడుతున్నారు.

తాజాగా మరో కొత్త ఓటిటి తెలుగులో రాబోతుంది.టీవీ 5 న్యూస్ ఛానల్ యాజమాన్యం కొత్త ఓటిటిని త్వరలో మొదలుపెట్టబోతుంది.

ఇప్పటికే ఈ ఓటిటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం.అందులో కంటెంట్ కూడా రెడీ చేస్తున్నారు.

అయితే ఈ శాటిలైట్ చానల్స్ కి భవిష్యత్తు అంతంత మాత్రంగానే ఉన్న నేపధ్యంలో టీవీ5 లాంటి న్యూస్ చానల్స్ ముందుగానే మేల్కొని డిజిటల్ స్ట్రీమింగ్ కి ఒటీటీ ప్లాట్ ఫాంని వేదికగా మార్చుకుంటున్నట్లు తెలుస్తుంది.మరి టీవీ5 న్యూస్ కోసమే ఈ ఒటీటీని వినియోగించుకుంటారా వెబ్ కంటెంట్ కూడా జెనరేట్ చేస్తారా అనేది వేచి చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube