మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ ఇమేజ్ ఉపయోగించుకొని ఆ ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఇప్పటికి క్రికెట్ టీమ్ రేంజ్ లో ఏకంగా 11 మంది ఎంట్రీ ఇచ్చారు.అయితే వీరిలో ప్రెజెంట్ జెనరేషన్ లో సక్సెస్ అయినవాళ్ళు అంటే రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ మాత్రమే.

 One More Mega Hero Entry With Brathuku Bus Stand, Tollywood, Telugu Cinema, Mega-TeluguStop.com

ఈ ముగ్గురు హీరోలు సొంతగా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.తమకంటూ ప్రత్యేకంగా మార్కెట్ ని ఏర్పరుచుకున్నారు.

మిగిలిన హీరోలు సినిమాలు చేస్తున్న సక్సెస్ అయితే తప్ప వారికి ప్రత్యేకంగా ఓపెనింగ్స్ కూడా రావడం లేదు.అయితే మెగాస్టార్ బ్రాండ్ ఇమేజ్ ని మాత్రం ఉపయోగించుకుంటున్నారు.

అలాగే మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని మెగాస్టార్ వారసులే కాకుండా కొనెదల ఇంటి పేరు ఉన్నవారు కూడా వస్తున్నారు.అలాగే అల్లు అరవింద్ ఫ్యామిలీ హీరోలు కూడా వస్తున్నారు.

ఇప్పుడు అల్లు అరవింద్ కుటుంబానికి రిలేషన్ ఉన్న ముత్తంశెట్టి ఫ్యామిలీ నుంచి మెగా కాంపౌండ్ హీరోగా ఒకరు పరిచయం అవుతున్నారు.

Telugu Allu Aravind, Viran, Telugu, Tollywood-Movie

అల్లు అర‌వింద్ బావ‌మ‌రిది కొడుకు ముత్తంశెట్టి విరాన్ హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగుపెడుతున్నాడు.బ‌తుకు బ‌స్టాండ్ అనే సినిమాతో విరాన్ తెలుగు తెర‌పై క‌నిపించ‌బోతున్నాడు‌.విర‌న్ న‌టిస్తున్న బ‌తుకు బ‌స్టాండ్ చిత్ర ఫ‌స్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ చిత్రం జూన్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.ఐఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.లవ్ అండ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే విరాన్ సినిమా కి అల్లు అర్జున్ విషెస్ చెప్పాడు.

ఈ హీరోగా మెగా, అల్లు కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల సంఖ్య 12కి చేరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube