ఆర్ఆర్ఆర్ లీక్.. చైల్డ్ ఆర్టిస్ట్ ఇలా ఉన్నాడు!

తెలుగు సినిమా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Child Artist Dhruvan Photo Leaked From Rrr, Rrr, Childhood Character, Ss Raja Mo-TeluguStop.com

ఈ సినిమాలో ఇద్దరూ తెలుగు స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమా పై అటు అభిమానులు, ఇటు తారక్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు తెలియడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు రాజమౌళి తెలియజేశారు.ఇప్పటికే విడుదలైన టీజర్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి కొన్ని సన్నివేశాలు లీక్ అవుతూ ఉండటం సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో లీక్ అయింది.

Telugu Alluriseeta, Dhruvan, Komaram Bheem, Leak, Ram Charan, Ss Raja Moulali-Mo

ఈ సినిమాలో ధృవన్ అనే కుర్రాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.తాజాగా ధ్రువన్ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఒక పోస్ట్ చేశారు.ఆ ఫోటోలో తలకు కండువా కట్టుకొని, పంచ కట్టులో ఉన్న ధ్రువన్ ఆ ఫోటోను షేర్ చేస్తూ అది ఆర్ఆర్ఆర్ సెట్ లోని ఫోటో అంటూ చెప్పడంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఈ పాత్ర ఎన్టీఆర్ కొమరం భీమ్ చిన్నప్పటిదని భావించగా, మరికొందరు అల్లూరి సీతారామరాజు పాత్ర అంటూ వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

అయితే ఈ ఫోటోలో ఉన్న కుర్రాడు ఎవరి పాత్రలో నటిస్తున్నారనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందేనని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube