బాహుబలి భారతదేశంలో అతి సంచలనాత్మకమైన హిట్ కావచ్చు, ఎన్నో బాలివుడ్ సినిమాలను దాటుకోని చాలా దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించవచ్చు.గత ఏడాది వచ్చిన అద్భుతమైన చిత్రాలను కాదని, ఈ సినిమాకి ప్రభుత్వం జాతీయ ఉత్తమ చిత్రం యొక్క పురస్కారాన్ని ఇచ్చి ఉండవచ్చు.
కాని మొదటిభాగం ఎన్నో విమర్శలను రుచిచూసింది అనే వాస్తవాన్ని మాత్రం కాదనలేం.
ఆస్కార్ ఎంట్రీల్లో మన దేశం నుంచి బాహుబలి వెళుతుందేమో అని అనుకున్నారంతా.
కాని షార్ట్ లిస్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయింది బాహుబలి.మళ్ళీ ఇప్పుడు, మరో అవమానం జరిగింది.
నవంబరు 20వ తేది నుంచి గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరగనుంది.ఈ ఫెస్టివల్ కోసం మొత్తం దేశం నుంచి 230 సినిమాలు వెళితే, అందులో మన తెలుగు చిత్రాలు 22 ఉన్నాయి.
కాని, బాహుబలిని కలిపి, ఒక్క తెలుగు సినిమా కూడా ఆ ఫెస్టివల్ లో అఫిషియల్ స్క్రీనింగ్ కోసం సెలెక్ట్ కాలేకపోయింది! బాక్సాఫీస్ ని గెలిచిన జక్కన్న, విమర్శకుల అలోచనను మాత్రం గెలవలేకపోయాడు.