విశాఖలో మరోసారి విష వాయువులు లీక్… ఇద్దరు మృతి  

One More Gas Leak Incident In Vizag - Telugu Andhra Pradesh, Lg Polymers Gas Leak,, Visakhapatnam

విశాఖ ఎల్జి పాలిమర్స్ ఘటన ఇప్పటికి అందరికి కళ్ళముందు కదులుతుంది.ఈ ఘటనలో మొత్తం 22 మంది వరకు చనిపోయారు.

 One More Gas Leak Incident In Vizag

వందల సంఖ్యలో అనారోగ్యంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు.భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత ప్రపంచం మొత్తాన్ని మరోసారి కదిలిచిన ఘటనగా ఎల్జీ పాలిమర్స్ ఘటన నిలిచింది.

ఇక ఇప్పటికి ఆ ఫ్యాక్టరీ పరిసరాలలో నివసించే ప్రజలు భయంతో వణికిపోతున్నారు.మరోవైపు దేశంలో కెమికల్ ఫ్యాక్టరీల సమీపంలో నివసించే ప్రజలకి కూడా విశాఖ ఘటన భయాందోళనకి గురి చేసింది.

విశాఖలో మరోసారి విష వాయువులు లీక్… ఇద్దరు మృతి-General-Telugu-Telugu Tollywood Photo Image

అలాగే కెమికల్ కంపెనీలలో సెక్యూరిటీ లెవల్స్ మీద కూడా అనుమానాలు వస్తున్నాయి.ఇక ఈ ఘటన మరువక ముందే విశాఖలో మరోసారి గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకుంది.

పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీలో విషవాయువు లీక్ అయింది.ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.మరో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి.అర్థరాత్రి దాటక రియాక్టర్ నుంచి విష వాయువులు లీక్ కావడంతో కంపెనీలో షిఫ్ట్ ఇన్ చార్జ్, కెమిస్ట్ మృతి చెందారు.

మృతి చెందిన వారిని కేజీఎచ్‌కు తరలించారు.తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిని గాజువాక ఆసుపత్రికి తరలించారు.

పరవాడలోని ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కె మీనా పరిశీలించారు.ప్రస్తుతం ప్రమాద తీవ్రత అంతగా లేదని అధికారులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనకి గల కారణాలు తెలుసుకునే పనిలో ఇప్పుడు పోలీసులు ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

One More Gas Leak Incident In Vizag Related Telugu News,Photos/Pics,Images..

footer-test