తొందరపడిన సాయిపల్లవి.. ఆమె ఖాతాలో మరో ఫ్లాప్ గ్యారంటీ అంటూ?

పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా రిలీజ్ డేట్ ను ఎంపిక చేసుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.సరైన రిలీజ్ డేట్ ను ఎంపిక చేసుకోవడం వల్లే సక్సెస్ సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

 One More Flop In Heroine Saipallavi Account Details, Sai Pallavi, Gargi Movie, S-TeluguStop.com

అయితే సాయిపల్లవి నటించిన గార్గి సినిమా ఈ నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.సాయిపల్లవి గత సినిమా విరాటపర్వం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విరాటపర్వం సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఈ సినిమా విడుదలైన కొన్నిరోజుల గ్యాప్ లోనే పాన్ ఇండియా మూవీగా గార్గి విడుదలవుతోంది.

జులై 14వ తేదీన రామ్ నటించిన ది వారియర్ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

మరోవైపు గార్గి సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు.

Telugu Flop Result, Gargi, Flop, Ram Warrior, Sai Pallavi, Saipallavi, Viratapar

సరైన ప్రమోషన్స్ లేకుండా సినిమాను విడుదల చేసినా నష్టమే తప్ప లాభం ఉండదనే సంగతి తెలిసిందే.సాయిపల్లవి సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.సాయిపల్లవికి ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉన్నా ఆ క్రేజ్ కలెక్షన్ల రూపంలో మారాలంటే మాత్రం ఆమె ఎంతో కష్టపడక తప్పదు.

Telugu Flop Result, Gargi, Flop, Ram Warrior, Sai Pallavi, Saipallavi, Viratapar

మరోవైపు సాయిపల్లవి ఎక్కువగా ఏడుపుగొట్టు పాత్రల్లో నటిస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సాయిపల్లవి ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.అయితే సాయిపల్లవి నటించిన విరాటపర్వం మొత్తం కలెక్షన్లు 5 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తం కావడం గమనార్హం.

సాయిపల్లవి కమర్షియల్ సినిమాలకు ఓటేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube