భయపెడుతున్న మరో స్మార్ట్ ఫోన్ గేమ్! గేమ్ ఆడుతూ యువకుడు ఆత్మహత్య  

One More Dangerous Game In Smart Phone Like Blue Whale-one More Dangerous Game,smart Phone,suicide Games

స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత యువతరం ఎక్కువ సేపు దానితోనే కాలక్షేపం చేస్తున్నారు. సమయం దొరికితే స్మార్ట్ ఫోన్ లో గేమ్స్, చిట్ చాట్ లు, టిక్ టాక్ లు ఇలా ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చే అన్ని యాప్ వాడేస్తూ సరదా తీర్చుకుంటున్నాడు. అయితే ఒక్కోసారి ఈ ఆటలు, సందడి శృతి ముంచుతుంది..

భయపెడుతున్న మరో స్మార్ట్ ఫోన్ గేమ్! గేమ్ ఆడుతూ యువకుడు ఆత్మహత్య-One More Dangerous Game In Smart Phone Like Blue Whale

వీటికి ఎడిక్ట్ అయిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గతంలో బ్లూ వెల్ అనే ప్రమాదకరమైన స్మార్ట్ ఫోన్ గేమ్ వచ్చింది. ఈ గేమ్ ఆడుతూ అందులో చాలెంజ్ లు పూర్తి చేసే క్రమంలో చాలా మంది యువత ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.

ప్రస్తుతం పబ్ జీ గేమ్ కూడా ఆ స్థాయిలో కాకపోయినా యువతకి ఒక వ్యసనంగా మారి ప్రాణాలు పోయేలా చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో ఆన్ లైన్ గేమ్ బ్లూ వెల్ కంటే ప్రమాదకరమైనది వచ్చింది అనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. మహారాష్ట్రలోని పూణే జిల్లాకు చెందిన దివాకర్ మాలే అనే యువకుడు ఆన్ లైన్ గేమ్స్ ఆడటం మొదలెట్టాడు.

ఈ గేమ్ ఆడుతూ ఈ మధ్య కాలంలో కాస్తా విచిత్రంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. ఈ క్రమంలో తాజాగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రమాదకరమైన గేమ్ ఆడటం వలన ఒత్తిడికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు.

అయితే ఆ గేమ్ మరింత వ్యాప్తి చెందకూడదన్న ఉద్దేశంతో పోలీసులు దాని బయటకి చెప్పలేదు.