ప్రపంచంలో అత్యధికంగా జనాభా కలిగిన దేశంగా చైనా, భారత్ దేశాలు పేరుపొందిన సంగతి అందరికి తెలిసిందే. అయితే జనాభా లోను, మరోవైపు టెక్నాలజీ వినియోగంలోనూ తనకు తానే సాటి అంటూ దూసుకుపోతోంది చైనా.
ఎప్పుడు విభిన్నంగా ఆలోచించి ప్రపంచదేశాలకు ఏదో ఒక సవాలు విసురుతూ ముందుకు సాగుతోంది చైనా దేశం. ఒకవైపు ప్రపంచం లోని మొత్తం దేశాలు కరోనా వైరస్ పుట్టుకకు చైనా కారణమని పెద్దఎత్తున నిందలు వేస్తున్నా.
చైనా అవన్నీ పట్టించుకోకుండా అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది.ఈ మధ్య కాలంలోనే కృత్రిమ సూర్యుడిని తయారుచేసుకొని డ్రాగన్ దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.
అయితే చైనా మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
చైనా అత్యాధునిక నూతన సాంకేతికతను ఉపయోగించి గంటకు 620 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలును ఆవిష్కరించబోతుంది.ఈ రైలును ఎక్కితే పట్టాలపై వెళ్తున్నట్టు అనిపించదు దీనికి కారణం ఈ రైలుకు చక్రాలు ఉండవు.
కేవలం మ్యాగ్నెటిక్ లిమిటేషన్ లెవిటేషన్ హై టెంపరేచర్ సూపర్ కండక్టర్ టెక్నాలజీ వాడుకొని ఈ కొత్త రూపకల్పన చేస్తుంది చైనా.ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యంత వేగంగా ప్రయాణించే రైలు కంటే ఈ రైలు మరింత వేగంగా పరిగెత్తగలదని చైనా శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
ఈ టెక్నాలజీ లో రైలు చక్రాలు కలిగి ఉండవు.కేవలం అయస్కాంత శక్తి సహాయంతోనే పట్టాలపై కొత్త టెక్నాలజీని ఉపయోగించి దూసుకువెళుతుంది.ఈ రైలు గంటకు 620 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.అంతేకాదు ఈ రైలు లోపల పూర్తిగా ఫైవ్ స్టార్ హోటల్ లో ఎలాంటి వసతులు కల్పిస్తారో.అలాంటి వసతులను కల్పించేలా రైలును సిద్ధం చేసుకోబోతోంది.ఇలాంటి రైళ్లను మాగ్లెవ్ రైళ్లు అని పిలుస్తారు.
అయితే ఈ టెక్నాలజీతో ఇదివరకే జపాన్ దేశంలో అందుబాటులోకి వచ్చిన ఆ రైళ్లు కేవలం గంటకు 320 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణం చేయగలుగుతున్నాయి.