దేవుడా.. ఆ కోడి ధర రూ.లక్ష పైనే, గుడ్డు వెయ్యి.. ఎందుకో తెలుసా..?

తాజాగా ఓ జాతికి చెందిన కోడి ధర లక్ష రూపాయలను దాటేసింది.కేవలం ఏడు కేజీలు ఉన్న ఆ కోడి ధర అక్షరాల లక్ష రూపాయలట.

 Hen Costs One Lakh Rupees, Eggs, Rare Species, Tamil Nadu, Hens, Kodipunju Cost-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముళ్లపాడు గ్రామంలో ఒక రైతు వివిధ రకాల జాతులు కోళ్లను పెంచుతున్నాడు.

ఆయన నడుపుతున్న కోళ్ల పరిశ్రమలో పెరుగుతున్న ఓ కోడి తెల్లటి రంగులో ఏడు కిలోల బరువు ఉండి 28 అంగుళాల ఎత్తు, మంచి సౌష్టవం కలిగి ఉన్న కోడి ఏకంగా లక్ష రూపాయల పైన పలుకుతుందని ఆయన ధీమాగా చెబుతున్నాడు.

ఆ కోళ్ల పరిశ్రమ నడుపుతున్న వ్యక్తి గత 30 సంవత్సరాలుగా కోళ్ల పెంపకంలో ఆరితేరారు.

అయితే గత ఐదు సంవత్సరాల నుండి అరుదైన జాతి కోళ్ల పెంపకంలో ఆయన నిష్ణాతులుగా మారారు.మొదట్లో ఆయన తాపీ మేస్త్రి గా పని చేయగా ఆ తర్వాత తాను ఎప్పుడు నుంచో అనుకుంటున్న కోళ్ల వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.

దీంతో ఆయన అరుదైన జాతి కోళ్లను పెంచడం మొదలు పెట్టారు.అయితే ఇంతలా ధర పలుకుతున్న కోడిని అతను తమిళనాడు రాష్ట్రం పొల్లాచ్చి నుండి కేవలం ఏడు నెలల వయసు ఉన్న సమయంలోనే ఆ కోడి కు ఏకంగా లక్ష రూపాయలను ఇచ్చి కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ కోడిని కొన్న దగ్గరనుంచి ఇప్పటివరకు పెంచేందుకు ఇరవై నాలుగు వేలు ఖర్చు అయ్యింది.దీంతో ఆయన ఆ కోడి పై పెట్టిన ఖర్చు ఒక లక్ష ఇరవై నాలుగు వేలకు చేరుకుంది.

అయితే ఆ కోడిని చూపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి కోడి ఎక్కడ దొరకదు అని ఆయన గర్వంగా చెబుతున్నారు.అంతేకాదు ప్రస్తుతం ఆయన అమ్ముతున్న కోళ్ల లో కనీసం 30 వేల రూపాయలకు తక్కువగా లేదట.

ఇక ఆయన దగ్గర కోళ్లను పెంచడానికి బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఉడికించిన గుడ్డు, వేరుశెనగలు, రాగులు, సజ్జలు ఇలా వివిధ రకాల ధాన్యాలను పెడుతూ వాటిని పోషిస్తున్నాడు.అయితే ఇంత కష్టపడుతున్న ఆయనకు ప్రతినెల 30000 వరకు ఆదాయం పొందుతున్నట్లు తెలిపాడు.

ఈయన దగ్గర కేవలం కోళ్లు మాత్రమే కాదు.ఆ కోళ్లకు సంబంధించిన గుడ్లు, కోడి పిల్లలను భారీ ధరకు అమ్ముతున్నాడు.

అతడు ఒక్క గుడ్డు ఏకంగా వెయ్యి రూపాయల వరకు అమ్ముతారట.అలాగే పది రోజుల వయస్సు ఉన్న కోడి పిల్లలను 5 వేల వరకు విక్రయిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube