భారతీయుడు కి లక్ష డాలర్ల పరిహారం చెల్లించిన..కంపెనీ       2018-07-04   03:30:21  IST  Bhanu C

మొండి తనంలో భారతీయులని మించిన వాళ్ళు ఎవరూ లేరు..ఈ సత్యం ప్రపంచానికి మొత్తం తెలుసు అందుకే ప్రపంచదేశాలు పని చేయడంలో భారతీయులకి ఉండే పట్టుదల ఎంతో ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతారు కాబట్టే ఎంతో మందిని ఉద్యోగాలలో చేర్చుకుంటారు..అయితే పని చేయడంలో ఎంత సంకల్పంగా ఉంటారో మోసపోయినా నష్టపోయినా దానికి సంభందించిన వారికి తగ్గ గుణపాటం కూడా చెప్తారు..ఇదే తరహా వ్యవహారం తాజాగా అమెరికాలో జరిగింది..భారత ఎన్నారై ఇచ్చిన షాక్ కి ఆ కంపెనీకి దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. వివరాలలోకి వెళ్తే..

అశోక్‌ పేయ్ అనే వ్యక్తి దివ్యాంగుడైన తన కుమారుడిని చూసుకునేందుకు, అతడికి దగ్గరగా ఉండేందుకు మరోచోటుకు బదిలీ చేయమని తానూ పని చేస్తున్న కంపెనీని అడిగాడు..అయితే కంపెనీ నిరాకరించింది అంతేకాదు అతడిని ఉద్యోగం నుంచీ తీసేసింది..దాంతో చిర్రెత్తుకొచ్చిన ఆ ఎన్నారై అమెరికా సమాన ఉద్యోగ అవకాశ కార్పొరేషన్‌ను(ఈఈఓసీ- అమెరికా ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కమిషన్) ఆశ్రయించాడు.ఆ కంపెనీలో బాధితుడు ఫెడరల్ కాంట్రాక్టరుగా పని చేశాడు. తనను ఉద్యోగంలో నుంచి తొలగించి వయసులో తనకంటే ఇరవై ఏళ్ల చిన్నవాడైన వ్యక్తిని నియమించారని, తన కొడుకు వైకల్యంతో పాటు తన వయసు కారణంగా కూడా తనపై వివక్ష చూపారని అతను దావా వేశాడు. దీనిపై విచారణ జరిపిన ఈఈఓసీ.. కంపెనీ చట్టాలను ఉల్లంఘించినట్లు పేర్కొన్నాడు..

అయితే అశోక్‌ కుమారుడి ఆరోగ్య పరిస్థితి వల్ల బదిలీకి నిరాకరించడం చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. కాంబర్‌ వర్జీనియా కార్యాలయంలో ఉద్యోగి పట్ల వివక్ష చూపినట్లు అమెరికా న్యాయ విభాగం కూడా తెలిపింది… దాంతో భారతీయుడిపై వివక్ష చూపించినందుకు గాను అమెరికాకు చెందిన కాంబర్ కార్పోరేషన్ సంస్థ అతనికి 1,00,000 డాలర్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ..అయితే కోర్టుల వరకూ వెళ్ళడంతో కంపెనీ అతడికి నష్ట పరిహారం విధించడానికి సిద్దం అయ్యింది.