రూ.10కే కిలో చేపలు... అయినా కొనేవాళ్లు లేరు... ఎందుకంటే?

సాధారణంగా కిలో చేపల ఖరీదు 100 రూపాయలకు అటూఇటుగా ఉంటుంది.కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ను బట్టి అంతకంటే ఎక్కువ ధరకే అమ్ముతారు.

 One Kilo Fish Rate Only 10 Rupees In Andhra Pradesh State Aakiveedu Village,one-TeluguStop.com

అయితే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్ లో మాత్రం కేవలం 10 రూపాయలకే కిలో చేపలను అమ్ముతున్నారు.సాధారణంగా అంత తక్కువ ధరకు అమ్మితే జనం ఎగబడి కొంటారు.

కానీ అక్కడ మాత్రం తక్కువ ధరకు అమ్మినా చేపలను కొనేవారే కరువయ్యారు.

వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల ఆకివీడు పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో ఏకంగా 40 టన్నుల చేపలు పైకి తేలాయి.

ఆక్సిజన్ అందకపోవడం వల్లే ఈ చేపలు పైకి తేలినట్లు నిపుణులు చెబుతున్నారు.భారీగా బయటపడ్డ చేపలను రైతులు ఆకివీడు మార్కెట్ కు తరలించారు.అయితే జనాలు మాత్రం వాటిని కొనుగోలు చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.వ్యాపారుల నుంచి జనాలు చేపలు కొనుగోలు చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు.

దీంతో చేసేదేం లేక కొందరు వ్యాపారులు చేపలను అక్కడే వదిలేసి వెళుతున్నారు.భారీ మొత్తంలో చేపలు బయటకు తేలటం వల్ల రైతులకు ఊహించని స్థాయిలో నష్టాలు వచ్చాయి.

తేలిన చేపలు కావడంతో ప్రజల్లో నెలకొన్న అపోహల వల్లే వాటిని తినడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.ఈ విషయం తెలిసిన మరి కొంతమంది రైతులు చేపలను మార్కెట్ కు తీసుకెళ్లడానికి కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.అయితే ఇదే మార్కెట్ లో సాధారణ చేపలు మాత్రం 70 రూపాయలకు పైగా పలుకుతుండటం గమనార్హం.10 రూపాయలకే అమ్మినా ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో నష్టాలు రాలేదని రైతులు వాపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube