వైరల్‌ : రూ. 1 కిలో చేపలు, ఎక్కడ ఎందుకో తెలుసా?

కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టిన వారు ముఖ్యంగా రిటైల్‌ రంగంకు చెందిన వ్యాపారాన్ని మొదలు పెట్టిన వారు ఖచ్చితంగా వారి వ్యాపారాన్ని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి.ఎక్కువ పబ్లిసిటీ అయితేనే ఎక్కువగా జనాల దృష్టిని ఆకర్షించి బిజినెస్‌ బాగా జరుగుతుంది.

 One Kg Fish For Only One Rupe In Chennai-TeluguStop.com

అందుకే షాపు ప్రారంభోత్సవం మొదట్లో ఎక్కువ శాతం ఆఫర్లు పెడుతూ ఉండటంతో పాటు, ఎన్నో రకాలుగా ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu Fish, Kgfish-

చెన్నైలోని ఒక చేపల వ్యాపారి చేసిన పనికి ప్రస్తుతం అంతా అవాక్కవుతున్నారు.షాపు ఓపెనింగ్‌ సందర్బంగా వంద కిలోల చేపలను కేవలం వంద రూపాయలకే అమ్మేశాడు.దాని వల్ల అతడికి పాతిక వేల నష్టం వచ్చింది.

మొదటి రోజే పాతిక వేల నష్టం పెట్టుకోవడం ఏంటీ అంటూ కొందరు ఎద్దేవ చేస్తారు.కాని అతడి ఆలోచన వేరు.

పాతిక వేలు నష్ట పోయినందుకు అతడు అనుకున్నది సాదించాడు.చెన్నైలోని ఒక ఖరీదైన ఏరియాలో ఈ చేపల దందా సాగింది.

Telugu Fish, Kgfish-

షాపు ప్రారంభ ఆఫర్‌ అంటూ రూపాయికే ఒక కిలో చేపలు ఇచ్చేస్తున్నట్లుగా ప్రకటన ఇచ్చేశాడు.దాంతో పెద్ద ఎత్తున చేపలను తీసుకునేందుకు అక్కడికి జనాలు ఎగబడ్డారు.రూపాయికి కిలో చేపలు అంటే ఎవరైనా పరిగెత్తుకుంటూ వస్తారు.అలా ఆ ఏరియాలోని దాదాపు అందరికి కూడా చేపల మార్కెట్‌లోని ఆ షాప్‌ గురించి తెలిసింది.ప్రతి ఒక్కరు కూడా ఆ చేపల షాప్‌ గురించి చర్చించుకుంటున్నారు.

Telugu Fish, Kgfish-

ఇప్పుడు మనం కూడా ఆ షాప్‌ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఏ స్థాయిలో ఆ షాపు ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెపనక్కర్లేదు.షాపు ఓపెనింగ్‌ విషయం అందరికి తెలియాలంటే చాలా పబ్లిసిటీ ఖర్చు చేయాలి.కాని ఆ షాపు యజమాని మాత్రం విభిన్నంగా రూపాయికే కిలో చేపలు అంటూ ప్రకటించి మంచి పబ్లిసిటీ కొట్టేశాడు.మొదటి వంద మందికి మాత్రమే కిలో రూ.1 చొప్పున చేపలను ఇవ్వడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube