కరోనా నుంచి కోలుకున్న వారికి బట్ట తల.. నిజమెంత?

కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది.

 Corona Virus, Covid-19, Losing Hair, Clumps-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏకంగా రెండు కోట్లమంది ప్రజలకు కరోనా వైరస్ వ్యాపించింది.అందులో కోటిమందికిపైగా ఈ కరోనా బారి నుండి బయటపడగా 7 లక్షలమంది కరోనా కు బలయ్యారు.

అయితే కరోనా నుండి కోలుకున్నవారు ప్రారంభంలో బాగానే ఉన్న నిదానంగా వారిలో ఒక్కో సమస్య వెలుగులోకి వస్తుంది. కొందరికి చెవులు వినిపించకుండా ఉంటే మరికొందరికి మరికొన్ని సమస్యలు వెలుగులోకి వస్తున్నాయ్.

ఇంకా తాజాగా ఇప్పుడు మరో సమస్య వెలుగులోకి వచ్చింది.అది ఏంటంటే జుట్టు రాలడం.

కరోనా నుంచి కోలుకున్న నలుగురిలో ఒకరి జుట్టు దారుణంగా రాలిపోతుందని ఒక సర్వే హెచ్చరిస్తుంది.మార్చిలో కరోనా ను జయించిన ఓ మహిళ తలపై జుట్టు మొత్తం కుచ్చులు కుచ్చులుగా ఊడిపోయి బట్టతల అయింది.

సగం కంటే ఎక్కువ జుట్టు రాలిపోయింది.ఇంకా ఈ ఘటన ఎసెక్స్కు చెందిన Grace Dudleyకి జరిగింది.

ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలపగా.ఇటీవల కోవిడ్ నుండి కోలుకున్న వారిలో 1,500 మందిపై సర్వే చెయ్యగా అందులో 27 శాతం మందికి జుట్టు రాలిపోయిందని గుర్తించారు.

కేవలం తలపైన కాకపోయిన శరీరంలో ఇతర భాగాల్లో జుట్టు రాలడం ఉండవచ్చునని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube