కొన్ని సినిమాలు కొందరు హీరోల జీవితాలను కీలక మలుపు తిప్పుతాయి.తమ సినీ కెరీర్ కనీవినీ ఎరుగని రీతిలో టర్న్ తీసుకోవడంలో ఆయా సినిమాలు కీలక పాత్ర పోషిస్తాయి.
సేమ్ ఇలాగే ఇద్దరు హీరోల జీవితాలను ఊహించని విధంగా ముందుకు తీసుకెళ్లింది ఓ సినిమా.ఒక సినిమా ఇద్దరు హీరోల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది అనేకదా మీ డౌట్.
మీరు అనుకున్నట్లు వాళ్లు ఇద్దరు కలిసి ఒకే సినిమా చేయలేదు.వేర్వేరు భాషల్లో తీసిన రెండు సినిమాల్లో నటించి బంఫర్ హిట్ కొట్టారు.
టాప్ హీరోలుగా ఎదిగిపోయారు.ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ సినిమా ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించిన హీరోలు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని నట వారసుడిగా అడుగు పెట్టిన నాగార్జున సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ నువ్వొస్తావని.నాగ్ కెరీర్ లోనే ఈ సినిమా సూపర్ ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది.స్టోరీతో పాటు, పాటలు కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.క్యూట్ బ్యూటీ సిమ్రాన్ నాగార్జున సరసన హీరోయిన్ గా చేసింది.
సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ మీద ఆర్.బీ చౌదరి ఈ సినిమాను నిర్మించారు వి.ఆర్ ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.అంధురాలు అయిన హీరోయిన్.
తాను ఇష్టపడే పాటలు పాడే అబ్బాయినే తాను ద్వేషిస్తున్నానని తెలుసుకొని.తన మనసు మార్చుకోవడమే ఈ సినిమా స్టోరీ.
యస్ ఏ రాజు ఈ సినిమాకు సంగీతం అందించారు.తన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణంగా చెప్పుకోవచ్చు.
మొత్తంగా ఈ సినిమా తెలుగులో సంచలన విజయం సాధించింది.వరుస పరాజయాలతో ఉన్న నాగార్జునకి మంచి హిట్ అందించింది.తెలుగులో మొత్తంగా రూ.13 కోట్ల రూపాయలు వసూళు చేసింది.
నిజానికి ఈ సినిమా తమిళ సినిమాకు రీమేక్.తమిళంలో విజయ్ హీరోగా తుల్లాదమనముమ్ తుల్లుమ్ సినిమా చేశాడు.ఎళిల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది.కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లు సాధించింది.విజయ్ టాప్ హీరోగా ఎదిగేందుకు ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది.