గోపాలకృష్ణ జీవితాన్ని మలుపు తిప్పిన ఒక్క డైలాగ్..ఏకంగా 8 ఛాన్సులు

తెలుగు చిత్ర పరిశ్రమలో పరుచూరి బ్రదర్స్ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన ఇండస్ట్రీలో రచయితగా ఎన్నో సినిమాలకు డైలాగ్ ను అందించారు.

 One Dialogue Leads To 8 Movie Chances To Paruchuri Gopala Krishna, Parachuri Gop-TeluguStop.com

ఇక తెలుగు తెరపై సాహసవంతమైన హీరోగా కృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు.ఆయన హాలీవుడ్ యాక్షన్ కథలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఆయనే.

ఇక అప్పట్లో కృష్ణ నుంచి అత్యధిక సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే వాటిలో ఎక్కువగా భారీ విజయాలను అందుకున్నాయి.అయితే మాస్ ఆడియన్స్ లో ఆయనకి విపరీతమైన ఇమేజ్ ఉండేదని అన్నారు.ఇక తాజాగా ‘పరుచూరి పలుకులు‘ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ హీరో కృష్ణ గురించి మాట్లాడారు.

ఇక అప్పట్లో వారికీ ఇండస్ట్రీలో ఒక కన్ను ఎన్టీఆర్ అయితే మరో కన్ను కృష్ణని చెప్పుకొచ్చారు.చిత్ర పరిశ్రమలో వారికీ పేరుపెట్టి పీట వేసింది అన్నగారైతే ఆ పీట ముందు పళ్లెం పెట్టి భోజనం వడ్డించింది కృష్ణ అని చెప్పుకొచ్చారు.

గోపాలకృష్ణ ఈ ఇద్దరినీ జీవితంలో మరిచిపోలేము కృష్ణ ఎప్పుడూ కూడా ఎక్కువసేపు కథను వినేవారని చెప్పుకొచ్చారు.

Telugu Bangaru Bhumi, Krishna, Khaidi Rudrayya, Dialogue, Parchurigoapala, Senio

ఇక ఓ 15 నిమిషాల్లో కథ వినేసి బాగుందో .లేదో చెప్పావారంట.అయితే ‘ఖైదీ రుద్రయ్య‘ కథను ఆయన కేవలం రెండు నిమిషాల్లో వినేసి ఓకే చెప్పారని చెప్పారు.

ఇక ఆయన చేసిన ‘బంగారుభూమి‘ సినిమాకి కూడా గోపాలకృష్ణ కూడా పని చేసినట్లు తెలిపారు.ఆ సినిమాలోని ఒక డైలాగ్ నచ్చి కృష్ణ మాతో వరుసగా ఎనిమిది సినిమాలకు రాయించారని అన్నారు.

Telugu Bangaru Bhumi, Krishna, Khaidi Rudrayya, Dialogue, Parchurigoapala, Senio

అయితే ‘బంగారు భూమి’ సినిమా కోసం నేను రాసిన డైలాగ్ ను షూటింగులో చెబుతూ ‘ఎవరు ఈ డైలాగ్ రాసింది’? అని కృష్ణ అడిగితే అక్కడివారు ఆ పేరు చెప్పారని తెలిపారు.“మనిషిని నమ్ముకుంటే మన నోట్లో ఇంత మట్టికొడతాడు.మట్టిని నమ్ముకుంటే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది .ఆ మట్టికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టు .“అనేది ఆ డైలాగ్.కృష్ణగారికి ఆ డైలాగ్ బాగా నచ్చేసిందని అన్నారు.

దాంతో ఆయన తాను చేయనున్న ఎనిమిది సినిమాలను వారికీ ఇప్పించారని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube