ఒక్క రోజు దేశభక్తి తప్పేం కాదు భయ్యా.... జోక్‌లు వేసే ప్రతి నా కొ..కు ఇది ఒక సారి చదవండి

నేడు రిపబ్లిక్‌ డే.దేశ వ్యాప్తంగా జాతీయ పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

 One Day Love On Our Nation Is Not A Mistake Lets Do Wish Them All-TeluguStop.com

వీలున్న వారు జెండావందనంకు వెళ్తున్న వారు, వీలు లేని వారు సోషల్‌ మీడియాలో దేశ భక్తిని చాటుకుంటున్నారు.సాధ్యం అయినంత వరకు అంతా కూడా నేడు కనీసం జెండాను చూడటం, దేశభక్తికి సంబంధించిన ఏదైనా విషయాన్ని పోస్ట్‌ చేయడం చేస్తున్నారు.

కాని కొందరు మాత్రం నేడు అందరు కూడా దేశభక్తులు అవ్వబోతున్నారు అంటూ కామెడీలు చేస్తున్నారు.సంవత్సరం అంతా ఏదో బిజీగా గడిపే జనాలు స్వాతంత్య్ర దినోత్సవం మరియు రిపబ్లిక్‌ డే రోజు అయినా దేశభక్తిని చాటుతున్నారు.

ప్రతి రోజు జెండాను పట్టుకోవడం, ప్రతి రోజు జనగనమన అంటూ పాడితేనే దేశక్తి ఉన్నట్లు కాదు భయ్యా… ఏరోజైతే అవసరమో ఆ రోజు దేశ భక్తి చూపించాలి.మనలో ఉన్న దమ్ము ధైర్యం ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూపిస్తే అంతా పిచ్చి వారు అంటారు.

అదే దాని అవసరం ఉన్న చోట, అంటే ఏదైనా సమస్య పరిష్కారం లేదా మరేదైనా అవసరం ఉన్న చోట ఆ దమ్ము ధైర్యం వాడినప్పుడు నిన్ను గొప్ప వాడు అంటారు.అలాగే ప్రతి రోజు కూడా దేశ భక్తి అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే ఇప్పుడు ఇలా అనే నువ్వే, వీడికి ఏం పని లేదారా అంటావు.

జెండావందనం రోజు దేశభక్తిని చాటేలా పోస్ట్‌లు చేయడం తప్పేంకాదు భయ్యా, కనీసం ఈరోజైనా జనాలకు దేశభక్తి గుర్తుకు వచ్చిందని సంతోషించు.అంతే కాని ఉన్నట్లుండి అందరు కూడా దేశభక్తులు అయ్యార్రో అంటూ కామెడీ చేయకండి.ప్రతి భారతీయుడు కూడా నేడు దేశం గురించి, మనకు స్వాతంత్య్రం వచ్చిన విధానం గురించి, మన నాయకులు మనకు ఎలా స్వాతంత్య్రం తీసుకు వచ్చారనే విషయాన్ని చర్చించుకోవాలి.

ప్రతి ఒక్కరు కనీసం రిపబ్లిక్‌ డే, స్వాతంత్య్ర దినోత్సవం రోజు అయినా దేశ భక్తితో కూడిన పోస్ట్‌లు పెట్టండి భయ్యా, ఎవడు నవ్వినా, కామెంట్‌ చేసినా పట్టించుకోకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube