అక్కడ ఒక 'టీ' రూ. 1000 అంట.. ఎందుకంటే..?!

చాలామందికి ఉదయాన్నే లేచి లేవగానే తాగేది ఏదన్నా ఉంది అంటే అది ఒక్క ఛాయ్ మాత్రమే.మనలో ఛాయ్ ప్రియులు కూడా చాలామంది ఉన్నారు.

 Cup Of Chai Costs Thousand Rupees, Kolkata, West Bengal Tea Stall, Ganguly Tea S-TeluguStop.com

వాళ్ళకి ఉదయాన్నే టీ తాగనిదే అసలు రోజు గడవదు.అది ఒక అలవాటులా మారిపోతుంది.

రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్స్ లో, వీధిలో, షాప్స్ లో, హోటల్స్ లో ఇలా ఎక్కడపడితే అక్కడ మనకు టీ హోటల్స్ ప్రత్యక్షమవుతూ ఉంటాయి కదా.అయితే అక్కడ స్టాల్స్ ఎమన్నా ఖాళీగా ఉంటాయా… ఉండవు.జనంతో నిండిపోయి ఉంటాయి.అప్పుడు వాళ్ళని చూసి మనం అనుకుంటాము కదా.అసలు ఏముంది ఈ ఛాయ్ లో ఇలా ఎగబడుతున్నారు అంటాం.కానీ, ఛాయ్ లో ఉన్న అద్భుతమైన మహిమ గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి రుచి చుడాలిసిందే మరి.

మన మెగాస్టార్ చిరంజీవి సైతం టీ యొక్క గొప్పతనాన్ని సినిమాలో ఒక పాట రూపంలో వివరించారు కదా.అసలు ఏంటి పొద్దు పొద్దునే ఈ ఛాయ్ గోల అనుకుంటున్నారా.దానికి ఒక కారణం ఉంది అండి.అదేంటో ఒకసారి చదివేయండి మరి… అసలు మాములుగా టీ రేట్ ఎంత ఉంటుంది.మహా అయితే రూ.5 తో మొదలుకొని.రూ.20 వరకు ఉంటుంది.కానీ అతడి స్టాల్‌ లో మాత్రం కప్పు టీ తాగితే అక్షరాలా వెయ్యి రూపాయిలు కట్టాలట.అవును మీరు విన్నది నిజమే.మరి ఆ చాయ్‌ కి అంత రేటు ఎందుకు.? అందులో అసలు ఏం కలుపుతారో తెలుసుకుందాం.కోల్‌కతాలో ఉన్న గంగూలీ టీ స్టాల్ చాలా ఫేమస్.రోడ్డు పక్కనే టీ స్టాల్ నడిపే పార్థ ప్రతిమ్ గంగూలీ అప్పట్లో ఒక కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేసేవాడు.

కానీ చిన్నపటి నుంచి ఇతడికి టీ అంటే ఎంతో ఇష్టం.ఆ ఇష్టంతోనే ఉద్యోగాన్ని వదులుకుని మరి 2014లో టీ వ్యాపారంలోకి దిగాడు.ముకుంద్‌పూర్‌ లో నిర్జాస్ టీ పేరిట టీ స్టాల్ పెట్టేశాడు.ఒక రకంగా అది టీ బార్ లాంటిది.
ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా లభించే 115 రకాల చాయ్‌ లు అందుబాటులో ఉంటాయట.కేజీకి రూ.2.8 లక్షలు పలికే జపాన్‌ స్పెషల్ టీ సిల్వర్ నీడిల్ వైట్ టీ, రూ.50వేలు నుంచి రూ.32 లక్షల వరకు ధర పలికే ఉండే Bo-Lay టీ కూడా లభిస్తుంది.అలాగే చమోమైల్ టీ – 14,000/kg, హిబిస్కస్ 7,500/kg, రూబియస్ – 20,000/kg, ఒకాయ్టి 32,000/kg, లావెండర్ 16,000/kg, బై ముదాన్ 20,000/kg వంటి టీ కూడా గంగూలీ స్టాల్‌లో దొరుకుతాయి.అంతేకాదు కేజీకి రూ.14 కే లభించే యెర్బా టీ కూడా మనకు అక్కడ దొరుకుతుంది.వీటితో పాటు చాకొలేట్, వైట్ టీ, మైజ్ టీ, బ్లూ టీ సైతం విక్రయిస్తాడు గంగూలీ.

ఏంటి టీ లో ఇన్ని రకాలు ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా.? అవును నిజంగానే ఉన్నాయి.ఎదో మనం ప్రతి రోజు తాగే టీ పొడిలాంటి రుచి ఉండదట.అక్కడ దొరికే టీ యొక్క రుచులు వేరు వేరుగా కమ్మని వాసన, రంగు, రుచితో ఉంటాయట.

మరి అంత రేటు పెట్టి టీ కొంటారా అంటే కొంటారని చెప్తున్నాడు షాప్ యజమాని.ఇతడి స్టాల్ మీదుగా వెళ్లే ప్రతి 1000 మందిలో 100 మంది ఖచ్చితంగా అక్కడ ఆగి టీ తాగుతారు.

గంగూలీ స్టాల్‌లో వెయ్యి రూపాయలకు అమ్మే టీ ఏంటో తెలుసా.? జపనీస్ వైట్ లీఫ్ టీ.ఈ ప్రీమియం టీ ఒక కప్ వెయ్యి రూపాయలు అంత ఎక్కువ ధరేమీ కాదని చెబుతాడు గంగూలీ.ఇక్కడ ఎక్కువ మంది మాత్రం మస్కటెల్ టీని తాగుతారు.

Telugu Chai Lovers, Cupchai, Kolkata, Tea, Variety Chais-Latest News - Telugu

పార్థ గంగూలీని చుట్టుపక్కల ప్రజలు ముద్దుగా ‘పార్థ బాబూ’ అని పిలుచుకుంటారు.కొన్ని రకాల టీలకు ముందే అడ్వాన్స్ చెల్లిస్తుంటారు అక్కడి స్థానికులు.కేవలం టీ అమ్మడం మాత్రమే కాదు.టీ పౌడర్‌ని కూడా విక్రయిస్తాడు గంగూలీ.అన్ని రకాల ముడి టీని అమ్ముతాడు.ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇక్కడకు వచ్చి బ్యాగులు బ్యాగులు తీసుకెళ్తారని ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు పార్థ గంగూలీ.

మరి మిలో ఎవరయినా ఛాయ్ ప్రియులు ఉంటే ఎప్పుడైనా కోల్‌కతా వెళ్తే మీరూ కూడా గంగూలీ బాబు టీని ట్రై చేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube