ఒక బీర్ కోసం పాతిక వేలు ఖర్చు పెట్టాడు... ఎందుకంటే...?  

One Beer Cost Was 25 Thousand - Telugu 25thousand, Beer, Cyber, Cyber Crime Police, General News, Hack, , Qr Code, Viral

సాధారణంగా ఒక బీర్ ఖరీదు ఎంత ఉంటుంది అంటే 100 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంటుంది.కానీ ఒక వృద్ధుడు మాత్రం ఒక బీర్ కోసం ఏకంగా 25,000 రూపాయలు ఖర్చు పెట్టాడు.

One Beer Cost Was 25 Thousand - Telugu 25thousand Cyber Crime Police General News Hack Qr Code Viral

ఆన్ లైన్ లో బీర్ డోర్ డెలివరీ పెట్టాలని ప్రయత్నం చేసి ఏకంగా 25,000 రూపాయలు కోల్పోయాడు.ఒక బీర్ వలన 25,000 రూపాయలు పోవడంతో ఇప్పుడు ఆ వృద్ధుడు కన్నీరుమున్నీరవుతున్నాడు.

పూర్తి వివరాలలోకి వెళితే 64 సంవత్సరాల వయస్సు గల రిటైర్డ్ ఇంజనీర్ నాలుగు రోజుల క్రితం ఆన్ లైన్ లో బీర్ ఆర్డర్ పెట్టాలని ఇంటర్నెట్ లో వెతికాడు.ఇంటర్నెట్ లో వృద్ధునికి నాలుగు హెల్ప్ లైన్ నంబర్లు కనిపించాయి.

ఆ హెల్ప్ లైన్ నంబర్లను వృద్ధుడు లోకల్ వైన్ షాప్ నంబర్లు అని భావించాడు.అందులో ఒక నంబర్ కు వృద్ధుడు కాల్ చేయగా అవతలి వ్యక్తి 350 రూపాయలు చెల్లిస్తే బీర్ డోర్ డెలివరీ చేస్తామని చెప్పాడు.

ఆ తరువాత అవతలి వ్యక్తి వృద్దుడికి క్యూఆర్ కోడ్ పంపించాడు.సైబర్ నేరగాడు చెప్పిన విధంగానే వృద్ధుడు ఆ క్యూర్ కోడ్ ద్వారా 350 రూపాయలు చెల్లించాడు.ఆ తరువాత కొద్ది సెకన్లలోనే వృద్ధుడి ఖాతా నుండి 12,345 రూపాయలు కట్ అయ్యయి.వృద్ధుడు హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి ఖాతా నుండి డబ్బులు కట్ అయ్యాయని చెప్పడంతో అవతలి వ్యక్తి పొరపాటు జరిగిందని చెప్పి మరో క్యూఆర్ కోడ్ పంపించాడు.

ఆ తరువాత కూడా వృద్ధుడి ఖాతా నుండి 12345 రూపాయలు కట్ అయ్యాయి.డబ్బులు కట్ కావడంతో ఏం చేయాలో అర్థం కాక లోకల్ వైన్ షాపుకు వెళ్ళి విచారణ చేశాడు.

లోకల్ వైన్ షాపులో ఉండే వ్యక్తులు అది తమ నంబర్ కాదని చెప్పడంతో వృద్ధుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

తాజా వార్తలు