ఏంది భయ్యా : ఒక్క బీర్ రేటు 30 వేల రూపాయలా...?

మనిషన్న తర్వాత కొంత కళాపోసన ఉండాలని అలాగే ఆట విడుపు కోసం అప్పుడప్పుడు పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు.కానీ కొందరు తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమకు ఇతర దేశాలకు వెళ్లి పర్యాటక ప్రాంతాలను చూడాలని ఉన్నప్పటికీ వెళ్ళలేక పోతుంటారు.

 One Beer Cost Is 30000 Rupees In Vietnam Country, Beer Cost News, Vietnam Countr-TeluguStop.com

కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం వింటే ఎగిరి గంతేస్తారు.ఇంతకీ ఆ విషయం ఏమిటంటే ఆ దేశాన్ని చుట్టుముట్టి రావాలంటే కేవలం 50 వేల నుంచి లక్ష రూపాయలు ఉంటే చాలు.

ఇందులోనే విమాన ఖర్చులు మరియు భోజన ఖర్చులు, హోటల్ ఖర్చులన్ని సరి పెట్టుకోవచ్చు.ఇప్పుడు అలాంటి దేశం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం…

ప్రపంచంలో ఉన్నటువంటి ఆసియా దేశాలలో వియత్నాం దేశం ఒకటి.

ఈ దేశం పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధిగాంచినప్పటికీ ఎప్పుడూ టెర్రరిస్ట్ దాడులకు గురవుతుంది.ఈ దేశపు ప్రభుత్వం మాత్రం పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులకు ఎలాంటి హాని కలగకుండా భద్రతా చర్యలను చేపట్టింది.

అయితే ఈ దేశపు కరెన్సీ తో పోలిస్తే మన దేశపు కరెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది.ఎంత ఎక్కువ అంటే మన దేశంలోని 30 రూపాయలు ఆ దేశంలోని పదివేల రూపాయలకి సమానం.

Telugu Beer Cost, Beercost, Tourist Vietnam, Vietnam-Latest News - Telugu

కాబట్టి అతి తక్కువ బడ్జెట్ తో ఇతర దేశాల ను సందర్శించాలనుకునుకునేవారికి వియత్నాం దేశం మంచి ఆప్షన్ గా ఉపయోగపడుతుంది.అయితే ఈ దేశంలో భూమి లోపల కొంత మంది తమ స్థావరాలను ఏర్పరచుకుని నివసిస్తున్నారు.ఈ క్రమంలో ఇంటర్ నెట్ మరియు విద్యుత్ సదుపాయాలను కూడా ఉపయోగిస్తున్నారు.ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో కొందరు సైనికులు సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు.యుద్ధం ముగిసిన తరువాత సైనిక స్థావరాలను ఖాళీ చేసి వెళ్లిపోవడంతో స్థానికులు అక్కడికి వెళ్లి వాటిని తమ నివాసాలకు అనుకగుణంగా మార్చుకున్నారు.

ఈ దేశంలో కోడి గుడ్డుతో చేసేటువంటి కాఫీ చాలా ఫేమస్.

అప్పట్లో పాలుకి కొంతమేర కొరత ఏర్పడడంతో కొంతమంది నిపుణులు కోడి గుడ్డు సొనతో కాఫీని తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేశారు.దాంతో ఈ కాఫీ ఈ దేశంలో మాత్రమే దొరుకుతుంది.

ఈ దేశం మద్యం ఉత్పత్తులు పెట్టింది పేరు.అందువల్లే ఇక్కడ మద్యం చాలా తక్కువ ధరకే దొరుకుతుంది.

ఈ దేశంలో ఒక్క బీరు ఖరీదు దాదాపుగా 30,000 వియత్నాం డాంగ్స్ ఉంటుంది.అంటే మన కరెన్సీ ప్రకారం 90 రూపాయలు.

ఇక్కడ ఎలాంటి మద్యం రకాలైన చాలా తక్కువ ధరలకే లభిస్తాయి.మద్యం ప్రియులకు ఈ దేశం మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.ఇక ఈ దేశంలో మరిన్ని చారిత్రక కట్టడాలు మరియు సుందరవనాలు చూడడానికి చాలా అందంగా , ఆహ్లాదకరంగా ఉంటాయి. దాంతో ఈ దేశానికి ప్రతి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube