కరోనా వాక్సిన్ తొలుత వారికే... తేల్చేసిన కేంద్రం

దేశ వ్యాప్తంగా కరోనా రోజు రోజుకి శరవేగంగా విస్తరిస్తుంది.ఇప్పటికే లక్షలు దాటిపోయిన కరోనా బాధితుల కారణంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో పూర్తి స్థాయిలో చికిత్సలు అందించలేని పరిస్థితి కనిపిస్తుంది.

 Once We Get Vaccine, Covid-19 Warriors Will Be First Ones, Health Ministry, Pm M-TeluguStop.com

రోగులు ఎక్కువ కావడంతో పాటు, డాక్టర్లు తక్కువ ఉండటం, అలాగే హాస్పిటల్స్ లో పూర్తి స్థాయిలో బెడ్స్ లేకపోవడంతో చాలా మందికి వైద్యం సరిగా అందడం లేదు.ఈ విషయాన్ని వీడియోల ద్వారా కరోనా బాధితులు తన ఆవేదనని పంచుకుంటున్నారు.

ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటల్స్ లో వెళ్దామంటే వారు కరోనా పేరు చెప్పు లక్షలు దోచేస్తున్నారు.ఇదిలా ఉంటే కరోనాని నియంత్రించడానికి దేశ వ్యాప్తంగా చాలా మంది శాస్త్రవేత్తలు వాక్సిన్ పై పరిశోధనలు చేస్తున్నారు.

ప్రస్తుతం మూడు వాక్సిన్ లు ప్రయోగ దశలో ఉన్నాయని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు.

ఇక ఈ వాక్సిన్ లలో ఏ ఒక్కటి అందుబాటులోకి వచ్చిన ముందుగా వాటిని కరోనాపై పోరాడుతున్న యోధులకు అందించాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే వ్యాఖ్యానించారు.

అంటే కరోనా పేషెంట్ లతో పాటు, కరోనాతో ఫైట్ చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ముందుగా కరోనా వాక్సిన్ ని అందించనున్నట్లు ఆయన మాటల ద్వారా తెలియజేశారు.తాజాగా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధాని ప్రకటించిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఎంతో ఉపయుక్తకరమైనదని అన్నారు.

భారత ఆరోగ్యరంగంలో ఇదో చరిత్రాత్మక నిర్ణయం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ, ప్రధాని మోదీ దీన్ని ప్రకటించారు.భవిష్యత్తులో ఆరోగ్యరంగం పెనుమార్పులను చూడనుంది అన్నారు.కరోనాకు వ్యాక్సిన్ కోసం భారత శాస్త్రవేత్తలు సైతం ఎంతో శ్రమిస్తున్నారని, ఇండియాలో మూడు రకాల వ్యాక్సిన్లు వివిధ దశలో పరీక్షలను ఎదుర్కొంటున్నాయని, ఒకసారి శాస్త్రవేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, భారీ ఎత్తున తయారు చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని అశ్విని కుమార్ చౌబే తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube