మరో బోల్డ్ బొమ్మ 15-18-24! హిట్ కోసం అతి

టాలీవుడ్ లో వచ్చే సినిమాలలో ఈ మధ్య కాలంలో చాలా వరకు బోల్డ్ కంటెంట్ తోనే వస్తున్నాయి.దర్శకులు తాము ఏం చెప్పాలనుకుంటున్నది పోస్టర్, ట్రైలర్ తోనే చెప్పేస్తున్నారు.

 Once More Bold Content Movie In Tollywood-TeluguStop.com

అయితే బోల్డ్ కంటెంట్ తో వచ్చే సినిమాలో క్వాలిటీ పరంగా ఒకే అనిపించుకున్న సినిమాలకి కొద్దిగా బజ్ దొరుకుతుంది.రిలీజ్ తర్వాత కూడా ఓ జోనర్ ఆడియన్స్, కుర్రాళ్ళు ఎక్కువగా ఈ తరహా సినిమాలని ఇష్టపడుతున్నారు.

తక్కువ బడ్జెట్ వచ్చే నిర్మాతలు సినిమా స్థాయిని బిగ్రేడ్ కి తీసుకోచ్చేశారు.ఇప్పుడు అదే దారిలో వస్తున్న మరో సినిమా 15-18-24 లవ్ స్టొరీ.

మూడు వయసులలో ప్రేమలోని ఎమోషన్స్ ని ఈ సినిమా ద్వారా దర్శకుడు కిరణ్ కుమార్ చెప్పబోతున్నాడని పోస్టర్ బట్టి అర్ధమవుతుంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ని హీరోయిన్ మెహరిన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ఇక పోస్టర్ లో స్కూల్ ఏజ్ జంట, అలాగే రొమాంటిక్ అండ్ బోల్డ్ గా ఉండే టీనేజ్ జంట.అలాగే ప్రొఫిషనల్ గా ప్రేమని ఆశ్వాదించే జంటలని చూపించారు.అయితే మధ్యలో ఉన్న జంటలో అమ్మాయి ఒంటిపైన ఎలాంటి అచ్చాధనం లేకుండా బోల్డ్ గా ఉంది.ఆమెని హీరో హగ్ చేసుకొని తమలో ఉండే ఉద్రేకాన్ని తగ్గించుకుంటున్నట్లు ఉండటం చూస్తూ ఉంటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది అర్ధమవుతుంది.

మరి ప్రేమలో ఉండే షేడ్స్ ని చూపించే ఈ సినిమాని ప్రేక్షకులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube