ఒక‌ప్పుడు క్రికెట‌ర్‌.. ఇప్పుడు ఫేమ‌స్ సైంటిస్ట్‌.. ఆయ‌నెవ‌రంటే..?

క్రికెట్ అంటే ఒక క‌ల‌.దాన్ని అందుకోవ‌డానికి ఎంతో మంది ప్ర‌య‌త్నించినా కొంద‌రు మాత్ర‌మే అక్క‌డ‌కు చేరుకోగ‌లుగుతారు.

 Once Cricketer But Now He Is A Famous Scientist Who, Cricket, Viral News, Avishk-TeluguStop.com

అయితే టీమ్ ఇండియాలో ఆడిన వారంతా కూడా ఆ స్థానాన్ని ప‌దిలంగా కాపాడుకుంటార‌ని చెప్ప‌లేం.కానీ ఒక్క సారైనా ఆడితే చాలు అనుకునే వారు కూడా ల‌క్ష‌ల్లో ఉంటారు.

ఇక మ‌నం కూడా వారి ఆటల‌కు మంత్ర ముగ్ధులం అవుతుంటాం.ఇక క్రికెట్‌లోకి అడుగు పెట్టిన త‌ర్వాత దాన్ని వ‌దులుకోవ‌డానికి పెద్ద‌గా ఎవ‌రూ ఇంట్రెస్ట్ చూపించ‌లేరు.

ఎందుకంటే క్రికెట్ అంటే ఎవ‌రికీ అంత సాధ్యం కాని ఒక స్థానం అనే చెప్పాలి.

అలాంటి ప్లేస్‌లోకి వెళ్లిన త‌ర్వాత ఆ స్థానాన్ని ఎవ‌రూ చేజార్చుకోవాల‌ని అనుకోరు.

కానీ ఓ క్రికెటర్ కొంచెం డిఫ‌రెంట్ గా ఆలోచించి ఎవరూ ఊహించని రీతిలో త‌న ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు.మాజీ టీమిండియా క్రికెటర్ ఆవిష్కార్ సాల్వి తీసుకున్న నిర్ణ‌య‌మే ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఆయ‌న క్రికెట‌ర్‌గా రాణించిన త‌ర్వాత ఆస్ట్రోఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి షాక్ ఇచ్చేశారు.ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు క్రికెట‌ర్ల ఎవ‌రూ కూడా ఇలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.దీంతో ప్రస్తుతం క్రికెట‌ర్ల‌లోనే అత్యున్నత విద్యను అభ్య‌సించిన వ్య‌క్తిగా ఆయ‌న నిలిచారు.

Telugu Astro Physics, Avishkar Salvi, Cricket, Netizens, Cricketer, Scientist-La

ఒకప్పుడు ఆయ‌న టీమిండియాకు ఫాస్ట్ బౌలర్ గా ఎన్నో సేవ‌లు అందించారు.బంతిని ఎంత వేగంతో వేస్తే వికెట్లు ప‌డుతాయో తెలిసిన క్రికెట‌ర్ ఇప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా మారిపోవ‌డంతో అంతా సంభ్రమాశ్చర్యాలకు లోన‌వుతున్నార‌నే చెప్పాలి.అయితే ఈ క్రికెట‌ర్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా మార‌డంతో అలాంటి సైంటిస్టులు అంతా కూడా కేవ‌లం నాసా లేదంటే ఇస్రో లాంటి సంస్థల్లో ఉంటార‌ని మ‌రి ఆయ‌న కూడా అక్క‌డికే వెళ్తారా అనేది మాత్రం ఇంకా స‌స్పెన్స్ గానే ఉంది.

మ‌రి ఇంత క‌ష్ట‌త‌ర‌మైన స‌బ్జెక్ట్ చ‌ద‌వ‌డ‌మంటే మామూలు విష‌యం కాద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.అంతా కూడా ఆయ‌న‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube