మరో సారి గొప్ప మనసు చాటుకున్న హీరో సూర్య... ఏం చేసాడంటే?

సినిమా రంగంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు వారంలో ఏదో ఒక సమయంలో విడుదలవుతుంటాయి.అందులో ప్రేక్షకుల మనసును కదిలించే సినిమాలు ఎన్ని ఉంటాయనే విషయాన్ని చర్చిస్తే చాలా తక్కువ ఉంటాయనే సమాధానం మనందరి నుండి వస్తుంది.

 Once Again, The Hero Surya Expressed A Great Mind  What Did He Do , Hero Suriya-TeluguStop.com

అయితే సినిమాలు సమాజాన్ని చాలా మేర ప్రభావం చూపిస్తాయనే మాట అక్షర సత్యం.ఈ విషయాన్ని ఎవరూ కాదనలేని పరిస్థితి ఉంటుంది.

ఇక అసలు విషయాన్నికొస్తే ఇటీవల సూర్య హీరోగా నటించిన చిత్రం జై భీమ్.ఈ సినిమా ఓటీటీలో విడుదలై ఎంతలా ప్రభంజనం సృష్టించిందో, ఇంకా సృష్టిస్తున్నదో మనం చూస్తున్నాం.

ఒక అన్యాయానికి గురైన మహిళకు లాయర్ ఎన్ని శక్తులు అడ్డొచ్చినా చివరి వరకు పోరాడి ఆమెకు న్యాయం దక్కేలా చేసిన ఓ అద్భుతమైన సినిమా.అయితే ఈ సినిమా ప్రస్తుతానికి 35 కోట్ల లాభంతో దూసుకెళ్తోంది.

అయితే లాభాల విషయాన్ని ప్రక్కకు పెడితే హీరో సూర్య ఒక హీరోగానే కాక ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక సినిమా హీరోగానే కాక వ్యక్తిగా కూడా ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు హీరో సూర్య.తాజాగా ఇటీవల జై భీమ్ సినిమా విడుదల అయిన తరువాత సీఎం స్టాలిన్ ను కలిసి గిరిజనాభివృద్ధికి కోటి రూపాయలు విరాళంగా అందించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా జై భీమ్ సినిమాలో బాధిత మహిళ సినతల్లి పేరిట పది లక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి మరో సారి తన గొప్ప మనసు చాటుకున్నారు హీరో సూర్య.ఈ మేరకు సూర్య నిర్మాణ సంస్థ 2d  ఎంటర్టైన్ మెంట్ సంస్థ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.

ఇక ఈ విషయం తెలిసిన సూర్య అభిమానులు తమ హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube