సాయి పల్లవి మరోసారి తన హెడ్‌ వెయిట్‌ చూపించింది  

Once Again Sai Pallavi Proves About Her Head Wait-kalyan Ram,sai Pallavi,sai Pallavi Next Movie

మలయాళ ‘ప్రేమమ్‌’ చిత్రంతో సౌత్‌లో మంచి పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి తెలుగులో ఫిదా చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ అమ్మడు తెలుగులో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. అయితే ఈమె హెడ్‌ వెయిట్‌ కారణంగా ఈమెకు వచ్చిన మంచి ఆఫర్లు పోగొట్టుకుంటుంది...

సాయి పల్లవి మరోసారి తన హెడ్‌ వెయిట్‌ చూపించింది-Once Again Sai Pallavi Proves About Her Head Wait

మంచి పాత్రలు కావాలని, మంచి కథలు కావాలంటూ కండీషన్స్‌ పెడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో ఆఫర్‌ను కూడా వదుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఆ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవిని ఎంపిక చేయాలని విరించి వర్మ భావించాడు. పల్లెటూరు నేపథ్యం కనుక సాయి పల్లవి అయితే బాగుంటుందనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేశాడు.

కాని సాయి పల్లవి మాత్రం తన పాత్రకు ప్రాముఖ్యత లేదంటూ కళ్యాణ్‌ రామ్‌తో నటించేందుకు నో చెప్పింది. వరుసగా తన వద్దకు వస్తున్న సినిమాలను కాదంటున్న సాయి పల్లవి కేవలం తమిళంపైనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా పడిపడి లేచే మనసు చిత్రం తెరకెక్కుతోంది. ఆ చిత్రంలో సాయి పల్లవి నటిస్తోంది. ఆ చిత్రం కాకుండా తెలుగులో ఈమె మరే సినిమాను కమిట్‌ కాలేదు.

తమిళంలో మాత్రం ఈమె వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా తమిళ స్టార్‌ హీరోల సరసన నటిస్తోంది. తమిళంలో పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో ఈమె టాలీవుడ్‌ను పట్టించుకోవడం లేదనే టాక్‌ కూడా వినిపిస్తుంది.