అనసూయ మరోసారి గర్బవతి..!  

Once Again Pregnancy For Anasuya-

హాట్‌ యాంకర్‌ అనసూయకు ఇద్దరు పిల్లలు అనే విషయం తెల్సిందే. ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత కూడా అందమైన అమ్మాయి మాదిరిగా అనసూయ కనిపిస్తూ బుల్లి తెర, వెండి తెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న విషయం తెల్సిందే. బుల్లి తెరపై జబర్దస్త్‌గా సందడి చేస్తున్న ఈ అమ్మడు వెండి తెరపై సంచలనాత్మక చిత్రాల్లో నటిస్తోంది..

అనసూయ మరోసారి గర్బవతి..!-Once Again Pregnancy For Anasuya

తాజాగా అనసూయ పుట్టిన రోజు జరుపుకుంది. పుట్టిన రోజు సందర్బంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.

తాను మొదటి నుండి కూడా ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటూ ఉంటాను.

పిల్లలు పుట్టినంత మాత్రాన కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాలి, ఇక గ్లామర్‌ ఫీల్డ్‌కు దూరంగా ఉండాలని భావించలేదు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఎందుకు ఈ వేశాలు అంటూ చాలా మంది విమర్శిస్తున్నా నేను వాటిని చాలా పాజిటివ్‌గా తీసుకున్నాను. కాని జనాలు మాత్రం ఎప్పుడు నన్ను టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు.

తాను మూడవ బిడ్డ కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. మూడవ బిడ్డ కోసం మరోసారి గర్బవతిని అవ్వాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

యాంకర్‌ అనసూయ ఇంకా మాట్లాడుతూ. ఎంత మంది పిల్లలు ఉంటే అంత సంతోషం. మా అమ్మమ్మకు ఎనిమిది మంది పిల్లలు. ఆమె పిల్లలు అంతా ఒక్క చోట చేరి, వారి పిల్లలు కూడా వస్తే ఆ సందడి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.

ఆమె అద్బుతమైన ఫీలింగ్‌ను అనుభవిస్తూ ఉంటుంది. అలాగే నేను కూడా చాలా మంది పిల్లలను కోరుకుంటున్నాను అంది. మా అమ్మకు మేము ముగ్గురం ఆడపిల్లలం అవ్వడం వల్ల నాకు మొదట బాబు పుట్టాలని చాలా గట్టిగా కోరుకున్నాను..

అనుకున్నట్లుగానే బాబు పుట్టాడు. ఇక రెండవ సంతానంగా పాప పుట్టాలని చాలా దేవుళ్లను వేడుకున్నాను. కాని రెండవ సారి కూడా బాబే పుట్టాడు.

అందుకే మరోసారి పాప కోసం ప్రయత్నించాలని భావిస్తున్నట్లుగా అనసూయ చెప్పుకొచ్చింది.