మరోసారి మన తెలుగమ్మాయి హీరోయిన్ గా వస్తుంది.. ఈ సారైనా పట్టించుకుంటరా..?

నటి ఐశ్వర్య రాజేష్.గురించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసే ఉంటుంది.

 Once Again Our Telugu Girl Comes As A Heroine Do You Care About This  Ashwarya,-TeluguStop.com

దీనికి కారణం ఈ మధ్య కాలంలో రిలీజైన వరల్డ్ ఫేమస్ లవర్ లో ఓ కీలక పాత్ర పోషించడంతో అందరికీ దగ్గర అయిపోయింది.తమిళంలో ఈవిడ మొదట చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ హీరోయిన్ గా ఎదిగింది ఈవిడ.

తన సినిమా కెరీర్ మొదట్లోనే ఇద్దరు పిల్లల తల్లిగా డి – గ్లామర్ రోల్ చేసి అందరినీ మెప్పించి జాతీయస్థాయిలో ప్రశంసలను దక్కించుకుంది.ఆ తర్వాత కూడా ఆవిడ ఎటువంటి స్కిన్ షో చేయకుండా పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే ఎంచుకుని తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఐశ్వర్య రాజేష్.

ఇకపోతే ఇదివరకు కాలంలో లేడీ ఓరియెంటెడ్ తమిళ్ సినిమా ‘ కనా ‘ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.అయితే అదే సినిమాను టాలీవుడ్ లో కౌసల్య కృష్ణమూర్తి అనే పేరుతో రీమేక్ చేయగా అది పెద్దగా హిట్ కాలేదు.

ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా ఓ చిన్న పిల్లాడికి తల్లిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈవిడ.సినిమా ప్లాప్ అవడంతో ఆవిడ కు మాతృభాషలో మాత్రం కెరియర్ ముందుకు సాగట్లేదు.

అయఅ గాని ఆవిడ తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు.ఇకపోతే తాజాగా ఐశ్వర్య తమిళంలో నటిస్తున్న ఓ చిత్రాన్ని తెలుగులో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

ఆ సినిమా పేరే భూమిక.ఈ సినిమా తనకు ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.అంతే కాదు ఆవిడ నటించబోయే 25వ సినిమా ఇది.ఈ సినిమాని రత్రింద్రన్ ప్రసాద్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించి తాజగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ లో ఐశ్వర్య రూపం కాస్త వెరైటీగా కనబడుతోంది.ఆ పోస్టర్ లో దట్టమైన అడవిలో పచ్చని చెట్ల నుంచి పుట్టుకొచ్చిన రూపంతో ఉన్నట్లుగా ఐశ్వర్య రూపం భారీ అంచనాలను నెలకొల్పుతుంది.

తమిళ సినిమా పరిశ్రమలో ఒక తెలుగు అమ్మాయిని నమ్మి ఇలా వరుసగా లేడి ఓరియెంటెడ్ సినిమాలను ఇస్తున్నారంటే నిజంగా అది ఐశ్వర్య గొప్పతనం అని చెప్పవచ్చు.ఇది వరకు కూడా మనతెలుగు అమ్మాయిలు అంజలి, శ్రీ దివ్య, ఆనంది, స్వాతి లాంటి వారు కూడా తమిళ చిత్ర పరిశ్రమలో వారి మార్క్ చూపించారు.

అందరితో పోలిస్తే నటి ఐశ్వర్య కు ఎక్కువ పేరు వచ్చిందని చెప్పవచ్చు.చూడాలి మరి తన 25 సినిమాతో కాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన మార్క్ ఎలా చూపిస్తుందో.

Telugu Ashwarya, Bhoomika, Cinima Insutsry, Kana, Kollywood, Lady Oriente, Tolly

ఇకపోతే నటి ఐశ్వర్య రాజ్ 1996లో రాంబంటు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తన నటనను ప్రారంభించింది.ప్రస్తుతానికి ఈవిడ భూమిక సినిమా తో పాటు టక్ జగదీష్ సినిమాలో కూడా నటిస్తోంది.తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ తమిళనాడు సినీ పరిశ్రమలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుందంటే నిజంగా ఆవిడ ప్రతిభను మెచ్చుకోవచ్చు.ఇక ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ కూడా తెలుగులో అనేక సినిమాలలో నటించారు.

ఇలా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన ఐశ్వర్య రాజేష్ తెలుగులో విజయాలు అందుకోలేకపోతున్న తమిళ చిత్ర పరిశ్రమలో వరుసపెట్టి విజయాలను అందుకుంటుంది.ఎందుకో మరి చాలా మంది తెలుగు హీరోయిన్స్ ను మన టాలీవుడ్ ప్రేక్షకులు అంతగా ఆదరించరు.

మన టాలీవుడ్ పరిశ్రమకు ఎక్కువగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి హీరోయిన్లను ఎక్కువగా పిలుచుకొని వచ్చి వారితో సినిమాలలో నటింపచేస్తున్నారు.ఇప్పటికైనా టాలీవుడ్ దర్శక నిర్మాతలు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్స్ ను ప్రోత్సహిస్తే ఎంతో మందికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది.

కోట్లకు కోట్లు డబ్బులు ఇచ్చి వేరే రాష్ట్రాల నుంచి హీరోయిన్లను పీల్చుకునే కంటే మన అచ్చతెలుగు హీరోయిన్లను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ఎంతో మంది నటీమణులు పేరు పొందుతారు.చూడాలి మరి ఈసారైనా ఐశ్వర్య రాజేష్ ను మన టాలీవుడ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో…?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube