మరోసారి నితిన్ తో జత కట్టబోతున్న రష్మిక

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రష్మిక మందన.ఈ అమ్మడు ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది.

 Once Again Nithin And Rashmika Combination-TeluguStop.com

రీసెంట్ గా వచ్చిన సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ లోకి కూడా ఈ కన్నడ భామ అడుగుపెట్టింది.ఇక తెలుగులో పుష్ప మూవీతో పాటు శర్వానంద్ కి జోడీగా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలలో నటిస్తుంది.

అలాగే హిందీలోకి తెరంగేట్రం చేసి వెంటనే వెంటనే ఏకంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టింది.ఈ నేపధ్యంలో రష్మిక కాల్ షీట్స్ మొత్తం ఫుల్ బిజీగా ఉన్నాయని చెప్పాలి.

 Once Again Nithin And Rashmika Combination-మరోసారి నితిన్ తో జత కట్టబోతున్న రష్మిక-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకదాని తర్వాత ఒకటి చేసిన ఆమె ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయడానికి కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమా కూడా టాలీవుడ్ లో ఆమె పేరు వినిపిస్తుంది.

యంగ్ హీరో నితిన్ కి జోడీగా భీష్మ సినిమాలో రష్మిక జత కట్టింది.

Telugu Bhishma Movie, Maestro, Nithin, Rashmika, Tollywood, Vakkantham Vamshi-Movie

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు రష్మిక పాత్రకి కూడా మంచి గుర్తింపు వచ్చింది.దీని తర్వాత రంగ్ దే కోసం ముందుగా రష్మికనే సంప్రదించిన ఎందుకనో ఆ ప్రాజెక్ట్ ని ఈ బ్యూటీ తిరస్కరించింది.దీంతో ఆ ప్లేస్ లోకి కీర్తి సురేష్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం రష్మికని తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ రేంజ్ అమాంతం పెరిగిపోవడంతో అవసరం అయితే రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చి అయిన ఆమెని ఫైనల్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

భీష్మలో నితిన్ రష్మిక జోడీ భాగా వర్క్ అవుట్ కావడంతో మరోసారి తమ కాంబినేషన్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని నితిన్ కూడా భావిస్తున్నట్లు బోగట్టా.మరి మరోసారి నితిన్ తో రొమాన్స్ చేయడానికి రష్మిక బేబీ ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.

#Rashmika #Maestro #Nithin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు