ఫామ్‌ హౌస్‌లో పెళ్లికి ఏర్పాట్లు

గత కొన్ని నెలలుగా తమిళ లేడీ సూపర్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార పెళ్లి గురించి చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, వచ్చాయి, వస్తూనే ఉన్నాయి.దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ తో ఈ అమ్మడి ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో వస్తున్న పుకార్లు అన్ని ఇన్నీ కావు.

 Once Again Nayanthara And Vignesh Shivan Marriage News Viral In Social Media,-TeluguStop.com

ఇప్పటికే వీరిద్దరు ప్రేమ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.కాని పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

అసలు వీరికి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పెళ్లి చేసుకుంటే సినీ కెరీర్‌ ఎక్కడ దెబ్బ తింటుందో అనే ఉద్దేశ్యంతో నయనతార పెళ్లి విషయాన్ని అస్సలు ఎత్తడం లేదు అనిపిస్తుంది అంటూ కొందరు నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు ప్రస్తుతం సహజీవనం సాగిస్తున్నారు.రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం ఏంటీ అనేది వారు నోరు విప్పితే కాని తెలియదు.కాని వారు మాత్రం నోరు విప్పడం లేదు.

ఈ సమయంలోనే మరో పుకారు తమిళ మీడియాలో షికారు చేస్తోంది.నయనతార పెళ్లి విషయంలో ఆసక్తిగా లేదు.కాని విఘ్నేష్‌ శివన్‌ కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి కోసం ఒత్తిడి చేస్తున్నారట.అందుకే ఇద్దరు పెళ్లికి రెడీ అవుతున్నారు అంటూ తమిళ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.

చెన్నై శివారులోని ఒక ఫామ్‌ హౌస్‌లో ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.మొదట గుడిలో నిరాడంబరంగా వివాహం జరుపుకోవాలని భావించారు.

కాని గుడిలో అయినా మీడియా వారి హడావుడి ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రైవేట్‌ ప్లేస్‌ లో ఎవరికి తెలియని చోట వివాహంకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఒకటి రెండు వారాల్లో వీరి పెళ్లికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

అసలు విషయం ఏంటీ అనేది వీరిద్దరిలో ఎవరో ఒకరు నోరు తెరిస్తే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube