తెలంగాణలో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
ఉదయం నుంచి ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీ కంపెనీలలో కూడా దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో మొత్తం 12 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.తీర్థ గ్రూప్ పేరుతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్, మైనింగ్, సోలార్ ఎనర్జీ, లిథియం బ్యాటరీల వ్యాపారాలు చేస్తున్నారు.
దాంతో పాటు సౌత్ ఆఫ్రికాలో మైనింగ్ వ్యాపారం చేస్తుంది తీర్థ గ్రూప్.ఈ నేపథ్యంలో ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు.







